Congress leader: కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్.. ఉచితం.. సముచితం కాదు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:10 PM
ఉచితాలు సమంజసం కాదని, శక్తి గ్యారెంటీతో బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే వ్యాఖ్యలు సర్వత్రా సంచలనానికి దారితీశాయి.

- శక్తి గ్యారెంటీతో.. బస్సుల్లో పురుషులకు సీట్లు కష్టమే
- కాంగ్రెస్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే వ్యాఖ్యలతో కలకలం
బెంగళూరు: ఉచితాలు సమంజసం కాదని, శక్తి గ్యారెంటీతో బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే(Senior Congress leader RV Deshpande) వ్యాఖ్యలు సర్వత్రా సంచలనానికి దారితీశాయి. ఇటీవలే ప్రభుత్వంపై సొంతపార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు బీఆర్ పాటిల్, రాజుకాగె, ఎన్‌వై గోపాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలోనే ఆర్‌వీ దేశ్‌పాండే వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు ఆప్తులుగా పేరొందినవారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్ళలకు కారణమవుతోంది. మహిళలు శక్తి గ్యారెంటీ ఉందని అడ్డూ అదుపులేకుండా ప్రయాణిస్తున్నారని బస్సుల్లో మగవాళ్లు కూర్చుని ప్రయాణించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అయితే దేశ్‌పాండే వ్యాఖ్యలపై పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీలో వ్యతిరేక మాటలు, ఆరోపణలు తీవ్రమైన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News