Gujarat Congress Cleanup: గుజరాత్ నుంచి కాంగ్రెస్ ప్రక్షాళన
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:36 AM
గుజరాత్‌లో పరాజయాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, 41 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులను నియమించింది. పార్టీ గాడిలో పెట్టేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’ ప్రారంభించింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్.. గత వైభవాన్ని సాధించేందుకు పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు నడుం బిగించింది. గుజరాత్ నుంచి పార్టీని ప్రక్షాళన చేసి గాడిన పెట్టేందుకు నిర్ణయించింది. ఆ రాష్ట్రంలోని 41 జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’ కార్యక్రమం కింద ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులను నియమించింది. మొత్తం 43 మంది ఏఐసీసీ పరిశీలకులు, ఏడుగురు సహాయ పరిశీలకులు, 183 మంది పీసీసీ పరిశీలకులు ఈ జాబితాలో ఉన్నారు. ఏఐసీసీ పరిశీలకులుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏపీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో పాటు తెలంగాణ నుంచి ఎంపీ బలరాం నాయక్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్.. ఏపీ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సిరివెళ్ల ప్రసాద్ నియమితులయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..