Congress Protest: ఎస్‌ఐఆర్‌పై వరుసగా ఏడో రోజు నిరసన
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:09 AM
బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ

న్యూఢిల్లీ, జూలై 30: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- ఎస్‌ఐఆర్) ప్రక్రియ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేస్తోంది. తక్షణమే ఈ సర్వేను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు వరుసగా ఏడో రోజు కూడా పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. సోనియా, ప్రియాంక గాంధీ సహా డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాది, ఆర్జేడీ, వామపక్షాలకు చెందిన ఎంపీలు.. ’’ఎస్‌ఐఆర్- ప్రజాస్వామ్యంపై దాడి’’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ బుధవార ం సమావేశాల ప్రారంభానికి ముందే నిరసన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News