CM Siddaramaiah: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. దేవుడి పూజతో పాపాలు పోవు..
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:43 PM
ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స చేశారు. దేవుడి పూజతో పాపాలు పోవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట చర్చకు దారితీశాయి. తోటి మనిషిని ప్రేమించడమే మానవత్వం.. అంటూ ముఖ్యమంత్రి అన్నారు.

- తోటి మనిషిని ప్రేమించడమే మానవత్వం
- 39 ఏళ్ల తర్వాత దొడ్డబాల జాతరలో సీఎం
బెంగళూరు: అంతా సవ్యంగా ఉందని చేయరాని తప్పులు చేసి, ఆ తర్వాత దేవుడి పూజలు చేస్తే పాపాలు పోవని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అన్నారు. దేవుడిని ఆరాధించడం నమ్మకమని వాటిని మూఢనమ్మకాలుగా భావించరాదన్నారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా బిండిగనవలి హోబళి దొడ్డబాల గ్రామంలో 39ఏళ్ల తర్వాత జరుగుతున్న హుచ్చప్పస్వామి, 14 కూటాల దేవుళ్ల జాతరను మంగళవారం సీఎం సిద్దరామయ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మనిషి వికృతమైన చర్యలకు పాల్పడి ఆ తర్వాత దేవుడికి మొక్కులు తీర్చుకున్నా ప్రయోజనం లేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Karnataka: కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ.. కీలక విషయాలు వెలుగులోకి..
తోటి మనిషిని ప్రేమించాలన్నారు. సమాజంలో అన్ని కులాలు, మతాలు ఒక్కటేనని, వారి నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. ఒకరి నమ్మకం పట్ల మరొకరికి గౌరవం ఉండాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా అందరి నమ్మకాలు పాటించే అవకాశం ఇచ్చిందన్నారు. ఆర్థిక, సామాజికశక్తి పెరిగితే కుల వ్యవస్థ తగ్గుతుందన్నారు. మంత్రులు చలువరాయస్వామి, బైరతి సురేశ్‌తోపాటు ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు. హుచ్చప్పస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు.
అగ్నిగుండంలో పడి అర్చకుడికి తీవ్రగాయాలు
మండ్య జిల్లా నాగమంగల తాలూకా దొడ్డబాల గ్రామంలో అగ్నిగుండంలో నడిచి వెళ్తున్న అర్చకుడు అదుపు తప్పి కిందపడ్డంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన అతడిని బెళ్ళూరు సమీపంలోని బీజీఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. దొడ్డబాళ గ్రామంలో హుచ్చప్పదేవర జాతర జరుగుతోంది. 39ఏళ్ల తర్వాత ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. వీరదేవరలు పెద్ద పండుగలో భాగస్వామ్యం కానున్నారు. 14 కూటాల దేవుళ్ల పండుగ జరుగుతోంది. ఉదయం అగ్నిగుండంలో నడిచి వెళ్తూ అర్చకుడు గుడ్డప్ప శివరామ జారిపడ్డాడు. భక్తులు అప్రమత్తమై వెంటనే అతడిని అగ్నిగుండం నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం సీఎం సిద్దరామయ్య జాతరను ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Singareni: సింగరేణి ఉపకార వేతనం
Read Latest Telangana News and National News