Share News

Emergency Delivery: రైల్వే స్టేషన్‌లో ఎమర్జెన్సీ డెలివరీ.. హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్‌తో ఆర్మీ డాక్టర్ వైద్యం

ABN , Publish Date - Jul 06 , 2025 | 07:21 PM

పాన్వెల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణకి నొప్పులు తీవ్రం కావడంతో ఝాన్సీ స్టేషన్‌లో ఆమెను కిందకు దించారు. పరిస్థితి గమినించిన ఒక మహిళా టిక్కెట్ స్టాఫ్ మెంబర్, మరొక ఆర్మీ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు.

Emergency Delivery: రైల్వే స్టేషన్‌లో ఎమర్జెన్సీ డెలివరీ.. హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్‌తో ఆర్మీ డాక్టర్ వైద్యం
Jhansi railway staion emergency delivery

ఝాన్సీ: మాతృత్వం ఒక వరం. మాతృమూర్తులు తొమ్మిది నెలలు కడుపులో మోసి బిడ్డను ప్రసవించేందుకు చావు అంచుల వరకూ వెళ్లి జన్మనిస్తుంటారు. నిండు చూలాలైన ఒక మహిళ రైలు ప్రయాణంలో ఉండగానే తీవ్రమైన నొప్పులు రావడంతో రైలును సమీపంలోని స్టేషన్‌లో ఆపారు. తక్షణ వైద్య సాయం అందకపోతే తల్లీబిడ్డలకు ప్రమాదకర పరిస్థితి. యాదృచ్ఛికంగా రైలు కోసం వేచి ఉన్న మెడికల్ ఆఫీసర్ ఒకరు తక్షణ సాయానికి ముందుకొచ్చారు. తనకు అందుబాటులో ఉన్న చిన్నచిన్న పరికరాలతో వైద్యం చేయడంతో ఆ గర్భిణికి సుఖప్రసవమైంది. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించగా, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. శనివారం మధ్యాహ్నం ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి మనోజ్ కుమార్ సింఘ్ ఆ వివరాలను అదించారు. పాన్వెల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణకి నొప్పులు తీవ్రం కావడంతో ఝాన్సీ స్టేషన్‌లో ఆమెను కిందకు దించారు. పరిస్థితి గమినించిన ఒక మహిళా టిక్కెట్ స్టాఫ్ మెంబర్, మరొక ఆర్మీ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. వీల్ చైర్‌లో ఆమెను తరలించే ప్రయత్నం చేస్తుండగా, మరో రైలు కోసం వేచి చూస్తున్న ఆర్మీ మెడికల్ కార్ప్స్ మెడికల్ అధికారి మేజర్ డాక్టర్ రోహిత్ బచ్‌వాలా (31) అక్కడకు చేరుకున్నారు. సమయం లేకపోవడం, పరిస్థితి తీవ్రత గుర్తించిన ఆయన వెంటనే రైల్వే స్టేషన్‌లోనే డెలివరీకి నిర్ణయం తీసుకున్నారు. సరైన ఆపరేషన్ థియేటర్ లేనప్పటికీ అందుబాటులో ఉన్న పరికరాలతో వైద్యం మొదలుపెట్టారు. దీంతో గర్భిణికి సుఖప్రసవమైంది. వెంటనే హెయిర్ క్లిప్‌తో బొడ్డు పేగును బిగించి, దానికి కత్తిరించేందుకు పాకెట్ నైఫ్‌ను ఉపయోగించారు. వెంటనే తల్లీబిడ్డను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి చేర్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు.


''సమయం మించిపోతే తల్లీబిడ్డకు అపాయం అని గుర్తించి ఆ ఏరియాను మేక్‌షిప్ట్ డెలివరీ ప్రాతంగా చేసి అందుబాటులో ఉన్న పరికరాలతో వైద్యం అందించాను. భగవంతుడి దయ వల్లే ఆ సమయంలో నేను అక్కడ ఉన్నాను. వైద్యులుగా మేము ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా వైద్యసాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలి. రెండు జీవితాలను కాపాడేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు' అని మేజర్ బచ్‌వాలా చెప్పారు. ఎమర్జెన్సీ కేసును విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఆయన యథాప్రకారం హైదరాబాద్ ట్రైన్‌లో తన జర్నీ కొనసాగించారు.


ఇవి కూడా చదవండి..

22 రోజుల తర్వాత హ్యాంగర్‌కు తరలించిన ఎఫ్-35 ఫైటర్ జెట్

బీహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 07:25 PM