Share News

Shivaji Satam: సీఐడీ సీరియల్‌లో కొత్త ట్విస్ట్.. ఏసీపీగా ఎవరంటే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:33 PM

Shivaji Satam: బుల్లి తెరలో మెగా సీరియల్ సీఐడీలో ఏసీపీ ప్రద్యుమన్ పాత్రలో శివాజీ సతం మరణించడాన్ని మినీ స్క్రీన్ ప్రేక్షకులు ఏ మాత్రం తట్టుకోలేక పోతున్నారు. శివాజీ సతం లేకుంటే.. సీఐడీ సీరియల్ లేదంటున్నారు. అలాంటి వేళ.. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ పాత్రపై కీలక అప్ డేట్ వచ్చింది.

Shivaji Satam: సీఐడీ సీరియల్‌లో కొత్త ట్విస్ట్.. ఏసీపీగా ఎవరంటే..
Shivaji Satam

బుల్లి తెరపై హిందీలో ప్రసారమైన సీఐడీ సీరియల్.. తెలుగులో సైతం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇందులో శివాజీ సతం పోషించిన ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర.. ఈ సీరియల్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే.. సీఐడీ సీరియల్ అంటే ఏసీపీ ప్రద్యుమన్. ఏసీపీ ప్రద్యుమన్ అంటే సీఐడీ సీరియల్ అన్నట్లుగా ఈ బుల్లి తెర క్రైమ్ కమ్ సస్పెన్స్ ప్లస్ థ్రిల్లర్ సీరియల్ అత్యంత ప్రజాదరణ పొందింది.

అయితే ఈ సీరియల్‌లో ఏసీపీ ప్రద్యుమన్ మరణించారు. దీంతో ఆ పాత్రలో శివాజీ సతం నటనకు ముగింపు పలికినట్లు అయింది. దాంతో ఈ సీరియల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రేక్షకులకు.. ఆయన పాత్ర మరణించిందంటే తట్టుకో లేక పోతున్నారు. ఇంకా చెప్పాలంటే వారంతా తీవ్ర కలత చెందుతున్నారు. సీఐడీ సీజన్- 2లో ఏసీపీ ప్రద్యుమన్ పాత్రలో పార్థ్ సమతాన్ పోషిస్తారంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది.

దీనిని శివాజీ సతం అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారంతా నిరసన సైతం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆదిత్య శ్రీవాస్తవ పాత్ర పోషించిన ఏసీపీ అభిజీత్‌కు జట్టులో సీనియారిటీ కారణంగా ఆ పాత్రను ఇచ్చి ఉండాల్సిందంటూ వారంతా అభిప్రాయ పడుతున్నారు.


మరోవైపు ఏసీపీ ఆయుష్మాన్ పాత్ర పోషించే సమతాన్.. ఐకానిక్ షోలో చేరడం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో.. ఈ వార్తపై మాట్లాడుతున్నప్పుడు.. తన కుటుంబం మొదట్లో తాను హాస్యమాడుతున్నానని భావించిందని, కానీ తరువాత తన విజయం పట్ల తన కుటుంబమంతా గర్వంగా ఉందని తెలిపారు.


ఇంకోవైపు శివాజీ సతం ఏసీపీ ప్రద్యుమన్ పాత్రను ప్రదర్శించిన పోస్ట్‌లు, ఆయనకు సంబంధించిన పాత వీడియోలు పంచుకొంటున్నారు.దీంతో శివాజీ సతం పాత్ర ప్రేక్షకుల మనస్సును ఎంతగా పెనవేసుకు పోయిందో దీని ద్వారా అర్థమవుతోంది. అలాంటి ఆయన చేసిన పాత్రలో పార్థ్ సమతాన్‌తో చేయడం పట్ల ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఒక అభిమాని అయితే.. ఉద్వేగభరితంగా ఇలా అన్నాడు. మీరు సీఐడీలో భాగం మాత్రమే కాదు శివాజీ సతం, సార్ - మీరు సీఐడీ. ఈ షో మీ కోసమే తయారు చేయబడిందన్నారు. మీరు లేకుండా ఈ సీరియలే ఉండదన్నారు.ఇది మార్కెటింగ్ వ్యూహమైనా లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా? కానీ మాకు మాత్రం ఒక విషయం ఖచ్చితంగా తెలుసు: ఏసీపీ ప్రద్యుమ్న తిరిగి రావాలని కుండ బద్దలు కొట్టారు.


మరొక అభిమాని మాట్లాడుతూ.. ఏసీపీ ప్రద్యుమన్ లేకుండా సీఐడీ ఏమిటి? దయా, అభిజీత్‌తో పాటు శివాజీ సతం కూడా ఈ షోకు ఆత్మ అని అభివర్ణించారు.


ఇంకోవైపు.. శివాజీ సతం తన పాత్ర మరణం స్పష్టంగా చూపించబడింది. శివాజీ సతం స్వల్ప విరామం అనంతరం సీఐడీకి మళ్లీ తిరిగి రావచ్చని ఊహాగానాలు తలెత్తుతోన్నాయి. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ సతం మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం విరామంలో ఉన్నానన్నారు. తాను తిరిగి మళ్లీ ఈ సీరియల్‌లో నటించడంపై తనకు ఏమి తెలియదని స్పష్టం చేశారు.

For National News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 09:33 PM