Rahul Gandhi: కాథలిక్ సంస్థలే ఆర్ఎస్ఎస్ తదుపరి టార్గెట్.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 06:39 PM
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా పలువులు బీజేపీ నేతలు ఈ బిల్లుకు క్రైస్తవ సంఘాలు, కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ మద్దతు తెలిపినట్టు చెప్పారు. దేశంలో వక్ఫ్‌కు 39 లక్షల ఎకరాలు ఉన్నట్టు ఒక అంచనాగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.

న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై వివాదం ఓవైపు కొనసాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైస్త్రవ మతమే ఆర్ఎస్ఎస్ తదుపరి టార్గెట్ అని అన్నారు. కాథలిక్ చర్చిలు దేశంలోనే అత్యధిక భూములు కలిగి ఉన్నాయని ఆర్ఎస్ఎస్ మౌత్‌పీస్ "ఆర్గనైజర్''లోని కథనాన్ని ఉటంకిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాథలిక్ సంస్థలు 7 కోట్ల హెక్టార్ల భూములు కలిగి ఉన్నాయని ఆర్ఎస్ఎస్ వెబ్‌సైట్‌లోని ఆర్టికల్ పేర్కొన్నట్టు రాహుల్ తెలిపారు.
PM Modi: మోదీకి శ్రీలంక 'మిత్ర విభూషణ' పురస్కారం
''వక్ఫ్ బిల్లుతో ముస్లింలపై దాడి జరుగుతుందని చెప్పాను. ఇప్పుడది భవిష్యత్తులో ఇతర మతాలను టార్గెట్ చేయడానికి మార్గం సుగమం చేస్తోంది. క్రిస్టియన్లను ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అలాంటి దాడుల నుంచి మన ప్రజలను కాపాడుకోవాలంటే రాజ్యాంగం ఒక్కటే మార్గం. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత" అని రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఆర్గనైజర్ ఆర్టికల్ ఆధారంగా వచ్చిన ఒక వార్తా కథనాన్ని తన ట్వీట్‌కు రాహుల్ జతచేశారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా పలువులు బీజేపీ నేతలు ఈ బిల్లుకు క్రైస్తవ సంఘాలు, కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ మద్దతు తెలిపినట్టు చెప్పారు. దేశంలో వక్ఫ్‌కు 39 లక్షల ఎకరాలు ఉన్నట్టు ఒక అంచనాగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ముస్లింలకు సొతమైన భూములను ఊడలాక్కునేందుకే ఈ బిల్లును అధికార పక్షం ప్రవేశపెట్టినట్టు విపక్షాలు చర్చ సందర్భంగా ఆరోపించాయి. అయితే, ఈ వాదనను అధికార పక్షం తోసిపుచ్చింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు మాత్రమే సవరణ బిల్లు తెచ్చామని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు
Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ
Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్, ఓపీఎస్ భేటీ
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
For National News And Telugu News