Chirag-Prashant Kishor: చేతులు కలిపిన చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్.. ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ
ABN , Publish Date - Jul 27 , 2025 | 09:27 PM
బిహార్‌లో శాంతి భద్రతల పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని, ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నందుకు విచారిస్తున్నామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై పాశ్వాన్ శనివారంనాడు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పప్పు యాదవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

పాట్నా: త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ ఆ రాష్ట్రంలో కొత్త పొత్తు చోటుచేసుకోనుందా? పూర్ణియా నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ (Pappu Yadav) ఇందుకు అవుననే చెబుతున్నారు. కేంద్ర మంత్రి, లోక్ జన్‌శక్తి పార్టీ (Ram Vilas) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan), జన్ సురాజ్ పార్టీ (JSP) చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) చేతులు కలిపారని పప్పుయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, చిరాగ్ పాశ్వాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించాలని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఒకవేళ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఇమడలేకపోతే తాము స్వాగతిస్తామని చెప్పారు.
'వాళ్లు (చిరాగ్, ప్రశాంత్ కిషోర్) కొద్ది సీట్లు సంపాదించినా అది జేడీయూను, నితీష్‌కుమార్‌ను చిక్కుల్లో పడేస్తుందనే విషయం అందరికీ తెలుసు. చిరాగ్ పాశ్వాన్‌కు అక్కడ (ఎన్డీయేలో) ఉండటం ఇష్టం లేకపోతే మేము ఆయనను స్వాగతిస్తాం' అని పప్పు యాదవ్ చెప్పారు.
బిహార్‌లో శాంతి భద్రతల పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని, ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నందుకు విచారిస్తున్నామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై పాశ్వాన్ శనివారంనాడు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పప్పు యాదవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో చిరాగ్ విమర్శలు అధికార ఎన్డీయేను చిక్కుల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్ విజయ రహస్యం ఇదే
మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి.. ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి