Prabodh Saxena: అధికారులకు విందు, బిల్లు ప్రభుత్వానికి.. సీఎస్ నిర్వాకంపై వివాదం
ABN , Publish Date - Apr 18 , 2025 | 06:48 PM
హోటల్ విందుకు అయిన ఖర్చు ప్రకారం, సుమారు75 మంది ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబాలకు ఒక్కో ప్లేటు ఖర్చు రూ.1,000 కాగా, డ్రైవర్ల భోజనానికి సుమారు రూ.600 ఖర్చయింది. రూ.11,000 టాక్సీ బిల్లుతో కలిపి మొత్తం బిల్లు రూ.1.2 లక్షలు తేలింది.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ చీఫ్ (Himachal Pradesh) సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా (Prabodh Saxena) వివాదంలో చిక్కుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు సిమ్లాలోని హిమాచల్ టూరిజం ఫ్లాగ్‌షిప్ హోటల్లో విందు పార్టీ ఇచ్చారు. దీనికి అక్షరాలా రూ.1.22 లక్షలు ఖర్చు కాగా, బిల్లును హోటల్ యాజమాన్యం సక్సేనాకు పంపగా, ఆయన దానిని సాధారణ పరిపాలనా విభాగానికి పంపారు. ఆ బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ కావడంతో విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తుందని ప్రశ్నించింది.
Kapil Sibal: ఇందిరాగాంధీ ఉదంతం గుర్తులేదా? జగదీప్ ధన్‌ఖడ్‌కు సిబల్ కౌంటర్
హోటల్ విందుకు అయిన ఖర్చు ప్రకారం, సుమారు 75 మంది ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబాలకు ఒక్కో ప్లేటు ఖర్చు రూ.1,000 కాగా, డ్రైవర్ల భోజనానికి సుమారు రూ.600 ఖర్చయింది. రూ.11,000 టాక్సీ బిల్లుతో కలిపి మొత్తం బిల్లు రూ.1.2 లక్షలు తేలింది. చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సెనా గత మార్చి 31న రిటైర్ కావాల్సి ఉంది. అయితే ఆయనకు మరో ఆరు నెలలు గడువు పొడిగించారు.
అధికార దుర్వినియోగం
ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి రణ్‌ధీర్ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాలో ఆఫీసర్ల పార్టీకి ప్రభుత్వం బిల్లు చెల్లిస్తోందని అన్నారు. ఆఫీసర్లు ఎంజాయ్ చేయడానికి, విందుల్లో తేలడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు్న్నారని ఆరోపించారు. పదేపదే సంస్కరణల మంత్రం పఠించే ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ఇలాంటి వ్యవహారాలు మళ్లీ జరక్కుండా చూడాలని అన్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై సక్కేనా కానీ, హిమాచల్ ప్రభుత్వం కానీ ఇంతవరకూ స్పందించ లేదు.
ఇవి కూడా చదవండి..