CJI BR Gavai: ఆసుపత్రిలో చేరిన సీజేఐ బీఆర్ గవాయ్
ABN , Publish Date - Jul 14 , 2025 | 09:03 PM
సీజేఐ ఈనెల 12న హైదరాబాద్‌లో పర్యటించారు. 'నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా' స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన ఇన్‌ఫెక్షన్ బారినపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలోనే 'బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్- రాజ్యాంగ సభ-భారత రాజ్యాంగం' పేరిట ఒక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) అస్వస్థతతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆసుత్రిలో చేరినట్టు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో విధులకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
సీజేఐ ఈనెల 12న హైదరాబాద్‌లో పర్యటించారు. 'నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా' స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన ఇన్‌ఫెక్షన్ బారినపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలోనే 'బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్- రాజ్యాంగ సభ-భారత రాజ్యాంగం' పేరిట ఒక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
కాగా, ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో సీజేఐ చేరారు. చికిత్స తీసుకుంటున్నందున సోమవారం నాడు విధులకు హాజరుకాలేదు. భారతదేశ 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ గత మే 14న ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఏడాది నవంబర్ 23న ఆయన పదవీకాలం ముగియనుంది.
ఇవి కూడా చదవండి..
గృహనిర్బంధం నడుమ.. గోడ దూకిన జమ్మూకశ్మీర్ సీఎం
నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి