Encounter: అడవుల్లో కాల్పుల మోత.. మావోలు హతం
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:10 PM
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోలు హతమయ్యారు.

ఛత్తీస్‌గడ్, ఏప్రిల్ 18: ఛత్తీస్‌గఢ్‌లో ( Chhattisgarh) మరోసారి భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి Maoists Death) చెందినట్లు పోలీసు వర్గాల సమాచారం. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కోహ్కమెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కసోద్ - కుమురాడి అడవిలో భద్రతాబలాగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉంది. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి.
గత 50ఏళ్లుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాము శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ లేఖలో తెలిపినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటాయి. భద్రతాబలగాలు మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. మావోయిస్టులు తారసపడిన వెంటనే కాల్పులు జరుపుతున్నారు. వారు తిరిగి ప్రతిఘటించినప్పటికీ అప్పటికే చాలా మావోయిస్టులు నేలరాలిపోతున్నారు. మావోయిస్టు అగ్రనేతలంతా కూడా భద్రతాబలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం వద్ద, అటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వద్ద దళాలు లొంగిపోతున్నారు.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వార్ జోన్ మారిపోయింది. వచే ఏడాది మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్టు పార్టీలను పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Read Latest National News And Telugu News