Chhattisgarh Encounter: కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:30 PM
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 12: వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యం వార్ జోన్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు (శనివారం) ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు హతమైనట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
గత పది రోజుల క్రితం బీజాపూర్ దంతెవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను హతయ్యారు. ఈమె తెలంగాణకు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కీలక మావోయిస్టులంతా కూడా నేలరాలుతుండటంతో మావోల్లో భయాందోళన నెలకొన్న పరిస్థితి. గత ఏడాది జనవరిలో మొదలైన ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 400లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దేశంలో మావోయిస్టులను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) చేసిన శపథంలో భాగంగా ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగుతున్నాయి.
LSG vs GT Prediction: లక్నో వర్సెస్ గుజరాత్.. విక్టరీ కొట్టేదెవరు.. వెనుదిరిగేదెవరు
చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో అబూజ్‌మట్ మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. అబూజ్‌మట్ టార్గెట్‌గా వేలాది మంది భద్రతాబలగాలు నలుదిక్కులుగా చుట్టుముట్టి ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. లొంగిపోతున్న వారు ఇచ్చిన సమాచారంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇటు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో హైఅలర్ట్‌గా ఉంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తీవ్ర అణచివేత ఉండటంతో మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించకుండా తెలంగాణ గ్రేహౌండ్స్ చాలా అప్రమత్తంగా ఉంది. వచ్చే మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో మావోయిస్టులను నిర్మూలిస్తామని చేపట్టిన ఆపరేషన్ కగార్ ఈ వేసవి కాలంలోనే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉందని, అందుకోసం శాంతి చర్చల కమిటీ పేరుతో మార్చి 29న జరిగిన కమిటీ సభ్యులు మధ్యవర్తత్వంగా శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ బేషరతుగా పిలుపునిచ్చినప్పటికీ కేంద్రం ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇవి కూడా చదవండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
Inter Supplementary Exams: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపుకు తుది గడువు ఇదే
Read Latest National News And Telugu News