Cell Phone: సెల్‌ఫోన్ వెలుగులో చికిత్స
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:49 PM
తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రభుత్వాసుపత్రిలో సెల్‌ఫోన్ వెలుగులో వైద్యులు చికిత్స చేయడంపై రోగులు, వారి సంబంధికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు, సిబ్బంది సెల్‌ఫోన్ లైట్లు వేశారు. దీంతో ఆ వెలుగులో సిబ్బంది వైద్యం అందించారు.

చెన్నై: తిరుప్పూర్ జిల్లా పల్లడం ప్రభుత్వాసుపత్రిలో సెల్‌ఫోన్(Cell Phone) వెలుగులో వైద్యులు చికిత్స చేయడంపై రోగులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పల్లడం సెంజేరిమలై ప్రాంతంలో సోమవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడి కాలు విరిగింది. చుట్టుపక్కల వారు అతడిని వెంటనే పల్లడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ వార్తను కూడా చదవండి: రూ.1.50 లక్షలకు పసికందు విక్రయం
ఆ సమయంలో ఆస్పత్రి పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రి ప్రాంగణంలోని జనరేటర్ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పనిచేయడం లేదు. దీంతో, వైద్యులు సెల్‌ఫోన్ వెలుగుల్లో క్షతగాత్రుడికి చికిత్స చేశారు. వైద్యులు సెల్‌ఫోన్ వెలుగులో చికిత్స చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Singareni: సింగరేణి ఉపకార వేతనం
Read Latest Telangana News and National News