Share News

Radhika Yadav Murder Case: ఇంట్లో ఆంక్షలు, స్వేచ్ఛ కావాలనుకున్న రాధిక.. హత్య కేసులో కీలక సమాచారం

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:54 PM

ఇంట్లోని పరిస్థితి, కెరీర్ పరంగా ఎదగాలనే తపన మాజీ కోచ్‌తో రాధిక మాట్లాడిన సంభాషణల్లో చోటుచేసుకున్నాయి. ఇంట్లో అనేక ఆంక్షలు పెడుతున్నారని, అయితే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, స్వతంత్రంగా బతకాలని ఉందని రాధిక అభిలషించింది.

Radhika Yadav Murder Case: ఇంట్లో ఆంక్షలు, స్వేచ్ఛ కావాలనుకున్న రాధిక.. హత్య కేసులో కీలక సమాచారం
Radhika Yadav

గురుగ్రామ్: హరియాణా క్రీడాకారిణి రాధికా యాదవ్ (Radhika Yadav) హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గురుగ్రామ్‌లోని నివాసంలో అతి సమీపం నుంచి రాధిక తండ్రి దీపక్ యాదవ్ కాల్పులు జరపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నేరాన్ని అంగీకరించిన దీపక్ యాదవ్‌కు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి శనివారంనాడు అప్పగించింది.


రాధిక టెన్నిస్ అకాడమీ నడుపుతుండటం, అది తరచు తండ్రీకూతుళ్ల మధ్య ఘర్షణకు దారితీయడం, కూతురు సంపాదనపై బతుకుతున్నావంటూ పలువురు హేళన చేయడంతో దీపక్ మనస్తాపానికి గురైనట్టు పోలీసులు చెబుతున్నారు. దీపక్‌కు పలు ఆస్తులున్నాయని, ఇంటి అద్దెలు వస్తుండటంతో ఆర్థికంగా బలంగానే ఉన్నారని, కూతురు సంపాదన మీద ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. టెన్నీస్ అకాడమీని ఆపేయాలని పలుమార్లు చెప్పినా అందుకు రాధిక నిరాకరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దీపక్ అతి సమీపం నుంచి కాల్పులు జరిపి కూతురు ఉసురుతీసుకున్నాడు. ఆసక్తికరంగా పోలీసుల దర్యాప్తులో భాగంగా మాజీ కోచ్‌తో రాధిక జరిపిన సంభాషణలు తాజాగా వెలుగుచూసాయి.


స్వతంత్రంగా బతకాలని ఆశించిన రాధిక

ఇంట్లోని పరిస్థితి, కెరీర్ పరంగా ఎదగాలనే తపన మాజీ కోచ్‌తో రాధిక మాట్లాడిన సంభాషణల్లో చోటుచేసుకున్నాయి. ఇంట్లో అనేక ఆంక్షలు పెడుతున్నారని, అయితే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, స్వతంత్రంగా బతకాలని ఉందని రాధిక అభిలషించింది. విదేశాలకు వెళ్లాలనే యోచనలో కూడా ఆమె ఉంది. దుబాయ్, ఆస్ట్రేలియా ఆమె ప్రాధాన్యతాక్రమాల్లో ఉన్నాయి. గతంలో చైనాకు వెళ్లినప్పుడు ముఖ్యంగా ఆహారం విషయంలో తనకు ఇబ్బందులు కలిగాయని, తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలనుకుంటున్నానని తెలిపింది. తన ప్లాన్స్ గురించి తండ్రితో పంచుకున్నప్పటికీ ఆయన నిరాకరించినట్టు తెలిపింది.


ఆర్థిక కోణం నుంచి ప్రధానంగా తన తండ్రి ఆందోళన పడేవారని, ఎంత కూడబెట్టావని అడిగేవాడని రాధిక తెలిపింది. డబ్బుల విషయంలోనే ఈ ఇద్దరి మధ్యా ప్రధానంగా చర్చ, అసమ్మతులు చోటుచేసుకునేవని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఆ కోణం నుంచి కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి..

కుటుంబ సభ్యుల మధ్య ముగిసిన రాధిక అంత్యక్రియలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 05:01 PM