Share News

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:11 PM

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్ వెళ్లకుండా నిలిపి వేసింది. ఇప్పుడు వీసాలను కూడా రద్దు చేసింది. పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది.

Pahalgam Terror Attack:  పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Pahalgam Terror Attack

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సింధు నదీ జలాలను పాకిస్తాన్‌కు సరఫరా కాకుండా నిలిపి వేసింది. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నీటిని ఆపి వేయడాన్ని తప్పుబడుతోంది. ఈ దెబ్బ నుంచి పాక్ కోలుకునే లోపే మరో దెబ్బ పడింది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీలకు విసాలను రద్దు చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి ఇండియాలోని పాకిస్తానీల వీసాలు రద్దు అవుతాయని వెల్లడించింది. పాకిస్తానీలు వీలైనంత త్వరగా ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది.


ఇక, మెడికల్ వీసాలు 29వ తేదీ వరకే పని చేస్తాయని స్పష్టం చేసింది. వీసా డెడ్‌లైన్ కంటే ముందే పాకిస్తానీలు తమ సొంత దేశానికి వెళ్లిపోవాలని అంది. భారత పౌరులు ఎవ్వరూ పాకిస్తాన్‌కు వెళ్లవద్దని హెచ్చరించింది. పాకిస్తాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కు తిరిగి రావాలని పేర్కొంది. ఇక, భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ప్రతి చర్యలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే భారత్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచేసుకుంది. వాఘా సరిహద్దును సైతం మూసేసింది. భారతీయులకు వీసాలను రద్దు చేసింది. భారతీయులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.


దాడిలో ఇద్దరు తెలుగు వాళ్ల మృతి

పహల్గామ్ దాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. వారిలో 25 మంది భారతీయులు కాగా.. ఒకరు నేపాల్‌కు చెందిన వారు. 25 మంది భారతీయుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయాడు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ముందు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించారు. మధుసూదన్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.


ఇవి కూడా చదవండి

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Pawan on Pahalgam Attack: అలా అడిగి మరీ చంపారంటే ఎంతటి దారుణం.. ఉగ్రదాడిపై పవన్

Updated Date - Apr 24 , 2025 | 05:56 PM