Share News

Ashwini Vaishnaw: త్వరలో 8వ వేతన కమిషన్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:54 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా, సకాలంలో ‘కొత్త జీతాలు’ అందించేలా 8వ వేతన కమిషన్‌ను నియమించాలని నిర్ణయించింది.

Ashwini Vaishnaw: త్వరలో 8వ వేతన కమిషన్‌

  • నియామకానికి ప్రధాని మోదీ ఆమోదం

  • కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

  • 2026 జనవరి 1 నుంచి ‘కొత్త జీతాలు’

  • గడువులోపు సంప్రదింపులకు కమిషన్‌

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా, సకాలంలో ‘కొత్త జీతాలు’ అందించేలా 8వ వేతన కమిషన్‌ను నియమించాలని నిర్ణయించింది. 2016 జనవరి 1వ తేదీ నుంచి 7వ వేతన కమిషన్‌ సిఫారసులు అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పదేళ్ల గడువు... ఈ ఏడాది చివరితో ముగుస్తుంది. 2026 జనవరి 1వ తేదీ సవరించిన వేతనాలు అందించేలా ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన సవరణ కమిషన్‌కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార-ప్రసార, రైల్వే, ఎలకా్ట్రనిక్స్‌-ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం విలేకరులకు తెలిపారు. క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన ఆయన... ఈ శుభవార్త కూడా వినిపించారు. ‘‘ప్రధాని మోదీ నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం పీఆర్సీని నియమిస్తున్నారు. 2016నుంచి అమల్లోకి వచ్చిన 7వ పీఆర్సీ సిఫారసులు ఈ ఏడాదితో ముగుస్తాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త పేకమిషన్‌ సిఫారసులు అమల్లోకి రావాలి. ఈలోపే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఇత ర భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సిఫారసులు చేసేలా త్వరలోనే 8వ వేతన కమిషన్‌ను వేస్తాం. ఒక చైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమిస్తాం’’అని వైష్ణవ్‌ తెలిపారు. మరో పక్షం రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న సమయంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటనరావడం మరో విశేషం. ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కొత్త కమిషన్‌ అమల్లోకి వస్తే కరువు భత్యం సర్దుబాటు జరిగి తమ వేతనాలు, పింఛన్లు పెరుగుతాయి. పే కమిషన్‌ను ఎప్పుడు నియమించనున్నదీ వైష్ణవ్‌ చెప్పలేదు.


7వ కమిషన్‌తో ఇలా...

వేతనాలు, పింఛన్లు లెక్కగట్టడంలో ఫిట్‌మెంట్‌ది కీలక పాత్ర. ఏడో కమిషన్‌ వేతనాలు సవరించే సమయంలో ఉద్యోగులు 3.68ఫిట్‌మెంట్‌ కోరారు. అయితే కేంద్రం 2.57 ఫిట్‌మెంట్‌ను నిర్ణయించింది. ఈ నిర్ణయంతో నాడు కేంద్ర ఉద్యోగుల కనీస మూల వేతనం (బేసిక్‌ పే) నెలకు రూ.18 వేలకు పెరిగింది (ఆరో వేతన కమిషన్‌ కాలంలో ఇది రూ.6వేలు ఉండేది). అలాగే కనీస పింఛను రూ.3,500 నుంచి రూ.9 వేలకు, గరిష్ఠ వేతనం రూ.2,50,000కు, గరిష్ఠ పెన్షన్‌ రూ.1,25,000కు పెరిగాయి. ఎనిమిదో వేతన కమిషన్‌ సిఫారసులతో కనీస, గరిష్ఠ వేతనాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల తీరుతెన్నులు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాల ఖరారులో వేతన కమిషన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా కేంద్ర వేతన కమిషన్‌ ప్రతి పదేళ్లకోసారి ఏర్పాటవుతుంది. 7వ వేతన కమిషన్‌ను 2014లో నియమించగా... దాని సిఫారసులు 2016 జనవరి 1నుంచి అమలులోకి వచ్చాయి. ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక సూచికల ఆధారంగా పే స్కేళ్లు, అలవెన్సులు, ప్రయోజనాలను ఎలా మార్పు చేయాలో వేతన కమిషన్‌ సూచనలు చేస్తుంది. దాని సిఫారసులు లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభా వం చూపుతాయి. అన్ని కేంద్రప్రభుత్వ శాఖలు, సంస్థలు వీటి సిఫారసులను అమలు చేస్తున్నాయి. 1947నుంచి ఇప్పటిదాకా కేంద్రం 7వేతన కమిషన్లను ఏర్పాటుచేసింది.

ఉద్యోగులు మాకు గర్వకారణం

‘‘వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం కృషి చేస్తున్న ప్రభు త్వ ఉద్యోగులు మాకు గర్వకారణం. 8వ పే కమిషన్‌ను ఆమోదిస్తూ కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర ్ణయం వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. వ్యయ సామర్థ్యాన్ని, వినియోగాన్ని పెంచుతుంది’’

- ప్రధాని మోదీ (ఎక్స్‌ వేదికగా)

Updated Date - Jan 17 , 2025 | 04:54 AM