Gyanesh Kumar: నకిలీ ఓట్లను అనుమతించేదే లేదు
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:44 AM
బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఎస్ఐఆర్‌ను ఎన్నికల ప్రధాన కమిషనర్..

ఓటర్ల తొలగింపు అబద్ధం: సీఈసీ
బిహార్‌లో ప్రత్యేక సవరణకు సమర్థన
న్యూఢిల్లీ, జూలై 24: బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్)ను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ గట్టిగా సమర్థించుకున్నారు. నకిలీ ఓటర్లు ఓటేయడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో అసలైన ఓటర్లను తీసివేస్తున్నామన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. అయితే కర్ణాటకలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని.. నూరు శాతం రుజువులున్నాయని.. ఒక నియోజకవర్గంలో వందలు, వేల అదనపు ఓటర్లను చేర్చారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అయి తే నిరాధార ఆరోపణలు చేయొద్దని, రాజ్యాంగ సంస్థను బెదిరిస్తున్నారని ఈసీ ఆక్షేపించింది. కాగా, బిహార్లో ప్రత్యేక సవరణను నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు గురువారం పార్లమెంటు ద్వారం వద్ద వరుసగా నాలుగో రోజూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ ఈసీపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఓ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీనిపై 90 శాతం కాదు.. నూరు శాతం రుజువులు చూపిస్తామని తెలిపారు. అయితే.. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడమే గాక.. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ఆయన బెదిరిస్తున్నారని విమర్శించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News