Share News

Driverless Cars: 2035 నాటికి కొత్తగా వచ్చే కార్లన్నీ డ్రైవర్‌ లెస్సే!

ABN , Publish Date - May 16 , 2025 | 05:05 AM

2035 నాటికి డ్రైవర్‌ లెస్‌ కార్లు మాత్రమే తయారవుతాయని ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లాలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న అశోక్‌ ఎల్లుస్వామి అన్నారు.

Driverless Cars: 2035 నాటికి కొత్తగా వచ్చే కార్లన్నీ డ్రైవర్‌ లెస్సే!

  • టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ ఎల్లుస్వామి

న్యూఢిల్లీ, మే 15: 2035 నాటికి డ్రైవర్‌ లెస్‌ కార్లు మాత్రమే తయారవుతాయని ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లాలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న అశోక్‌ ఎల్లుస్వామి అన్నారు. డ్రైవర్‌ రహిత కార్లదే భవిష్యత్తు అని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన అశోక్‌ ఎల్లుస్వామి ఓ పాడ్‌కా్‌స్టలో ఈ మేరకు మాట్లాడారు. ‘‘2035 నాటికి అన్నీ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లే తయారవుతాయి.


భవిష్యత్తులో ఎవరైనా సరదాగా కారు నడుపుదామని అనుకుంటే పాత మోడల్‌ కారు కొనుగోలు చేయాల్సిందే. డ్రైవర్‌ లెస్‌ కార్లదే భవిష్యత్తు’’ అని అన్నారు. అలాగే, అమెరికాలోని కొన్ని నగరాల్లో డ్రైవర్‌ లెస్‌ కార్లను అందుబాటులోకి తీసుకురావాలని టెస్లా ప్రయత్నాలు చేస్తోందని అశోక్‌ ఎల్లుస్వామి వెల్లడించారు.

Updated Date - May 16 , 2025 | 05:05 AM