Share News

British Royal Navy: ఎగరని రాయల్‌ ఎఫ్‌-35

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:17 AM

ది బ్రిటిష్‌ రాయల్‌ నేవీకి చెందిన ఎఫ్‌-35 యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో జూన్‌ 14న కేరళలోని తి రువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది....

British Royal Navy: ఎగరని రాయల్‌ ఎఫ్‌-35

  • ఊడదీసి కార్గోలో బ్రిటన్‌కు తరలించాల్సిందే

న్యూఢిల్లీ, జూలై 3: ది బ్రిటిష్‌ రాయల్‌ నేవీకి చెందిన ఎఫ్‌-35 యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో జూన్‌ 14న కేరళలోని తి రువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అప్పటి నుంచి దానికి మరమ్మతులు చేసేందుకు ఇంజనీరింగ్‌ సిబ్బంది ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో దాన్ని ఊడదీసి విడిభాగాలను మిలిటరీ కార్గో విమానంలో బ్రిటన్‌కు తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.


ఇది ఐదో జనరేషన్‌కు చెందిన స్టీల్త్‌ జెట్‌. గతనెలలో కేరళ తీరానికి 100 నాటికల్‌ మైళ్ల దూరంలో హెచ్‌ఎంఎస్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ క్యారియర్‌ స్ర్టైక్‌ గ్రూప్‌ నిర్వహించిన ఆపరేషన్లలో ఈ యుద్ధ విమానం పాల్గొంది. ప్రతికూల వాతావరణం, ఇంధనం తక్కువగా ఉండటంతో ఈ యుద్ధ విమానాన్ని అత్యవసరంగా తిరువనంతపురం వైపు మళ్లించారు. అది సురక్షితంగా తిరువనంతపురంలో దిగేలా భారత వైమానిక దళం తోడ్పాటు అందించింది.

Updated Date - Jul 04 , 2025 | 04:17 AM