Terror Attack: పర్యాటకులపై దాడిని అడ్డుకునే క్రమంలో హుస్సేన్ మృతి
ABN , Publish Date - Apr 24 , 2025 | 07:42 AM
పర్యాటకులను గుర్రంపై బైసారను తీసు కెళ్తుంటాడు హుస్సేన్. అదే అతనికి జీవనోపాధి. మంగళవారం కూడా పర్యటకులను బైసారన్ పచ్చిక బయళ్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి క్యాంపుల్లోని పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నపుడే ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. వారిని అడ్డుకొనే క్రమంలో హుస్సేన్ ప్రాణాలొదిలాడు.

జమ్మూ కశ్మీర్: ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతున్న పర్యాటకులపైకి (Tourists) ఉగ్రవాదులు (Terrorists) ఒక్కసారిగా కాల్పులకు తెగబడగా.. ప్రాణభ యంతో అందరూ పరుగులు తీశారు. కానీ, ఒక్క - వ్యక్తి మాత్రం ముష్కరులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పహెల్గామ్ (Pahelgam)లోని బైసారన్‌లో (Baisaran) ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా.. తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు. అతనే సయీద్ అదిల్ హుస్సేన్ షా (Syed Adil Hussain Shah) స్థానికుడైన హుస్సే న్.. తన గుర్రంపై పర్యాటకులను బైసారన్ తీసుకెళుతుంటాడు. మంగళవారం తన కళ్లెదుటే ముష్కరులు అమాయకులైన పర్యాటకులపై విచక్ష ణారహితంగా కాల్పులు జరుపుతుంటే తట్టుకోలేకపోయాడు. దాడిని అడ్డుకునేందుకు ధైర్యంగా ముందుకెళ్లాడు. ఉగ్రవాదుల నుంచి తుపా కులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో ముష్కరుల తూటాలకు బలైపోయాడు.
Also Read..: నిఘా వర్గాలు హెచ్చరించినా
పహెల్గామ్ నుంచి సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్ళాలంటే నడక, గుర్రపు స్వారి తప్ప వేరే మార్గం లేదు. ఈ క్రమంలోనే వాహనాలు పార్కింగ్ చేసిన చోటు నుంచి పర్యాటకులను గుర్రంపై బైసారను తీసు కెళ్తుంటాడు హుస్సేన్. అదే అతనికి జీవనోపాధి. భార్య, పిల్లలు, తల్లిదం డ్రులను అతనే పోషిస్తున్నాడు. మంగళవారం కూడా పర్యటకులను బైసారన్ పచ్చిక బయళ్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి క్యాంపుల్లోని పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నపుడే ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. వారిని అడ్డుకొనే క్రమంలో హుస్సేన్ ప్రాణాలొదిలాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడినట్లయింది. తమకు న్యాయం చేయాలని హుస్సేన్ తల్లితండ్రులు కోరుతున్నారు. 'నా కుమారుడు గుర్రం తీసుకొని పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉగ్రదాడి గురించి మాకు తెలిసింది. వెంటనే హుస్సేను ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఆ దాడిలో నా కుమారుడు చనిపోయాడని తర్వాత తెలిసింది' అంటూ హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ కన్నీరుమున్నీరయ్యారు.
ప్రపంచ దేశాల ఖండన
పహెల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమాయకులైన పౌరులను కాల్చి చంపడం అనాగరిక, అమానవీయ చర్య అని 20కు పైగా దేశాలు పేర్కొన్నాయి. అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయెల్, యూఏఈ, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, తదితర దేశాలు ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతానం. తెలిపాయి. సహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరైన్, ఈయూ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి రాజా. కల్లాన్ కూడా ఖండించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగ్రదాడి దిగ్ర్భాంతి కలిగించింది: బాబు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు బుద్ధి చెప్పాలి
For More AP News and Telugu News