Share News

BR Gavai: సంజీవ్ ఖన్నా తర్వాత సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:07 PM

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు.

BR Gavai: సంజీవ్ ఖన్నా తర్వాత సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యాయశాఖకు జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు చేశారు. మే 13వ తేదీతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియనుంది. దీంతో 51వ సీజేఐగా జస్టిస్ గవాయ్ మే 14న బాధ్యతలు చేపడతారు.

Vijay: 234 నియోజకవర్గాల్లో విజయ్‌ సేన సర్వే


కాగా, జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలు కొనసాగనున్నాయి. నవంబర్‌లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన గవాయ్‌కు ముందు ఇదే సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ 2007లో సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.


మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985 న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు. 1992లో నాగపూర్ బెంచ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులై 2005లో పెర్మనెంట్ జడ్జి అయ్యారు. 2019లో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.


ఇవి కూడా చదవండి...

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 21 , 2025 | 10:13 AM