Share News

Delhi School Bomb Threat: ఢిల్లీ, బెంగళూరులో బడులకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:21 AM

దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.

Delhi School Bomb Threat: ఢిల్లీ, బెంగళూరులో బడులకు బాంబు బెదిరింపులు
Delhi School Bomb Threat

న్యూఢిల్లీ, బెంగళూరు, జూలై 18: దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఢిల్లీలో ఈ వారంలో ఇప్పటికే నాలుగుసార్లు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో అత్యవసర స్పందన బృందాలు, బాంబు నిర్వీర్య బృందాలు, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. ఇక్కడ బాంబు బెదిరింపులు వచ్చిన వాటిలో మూడు కళాశాలలు కూడా ఉన్నాయి. తరగతి గదుల్లో నల్లటి బ్యాగుల్లో అనేక బాంబులు పెట్టినట్లు ఆయా పాఠశాలలకు ఈ మెయిళ్ల ద్వారా బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదన్నారు. కాగా బెంగళూరులోని 50 బడులకు శుక్రవారం ఇదేవిధమైన బాంబు బెదిరింపులు వచ్చాయి. అవన్నీ ఉత్తుత్తివేనని తేలిందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:21 AM