UIDAI School Biometric Drive: పిల్లల బయోమెట్రిక్ బడుల్లో అప్‌డేట్
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:34 AM
పాఠశాలల్లోనే పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ..

న్యూఢిల్లీ, జూలై 20: పాఠశాలల్లోనే పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) భావిస్తోంది. 2నెలల తర్వాత విడతల వారీగా బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను చేపట్టనున్నట్టు యూఐడీఏఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిల్లలకు ఐదేళ్లు వచ్చిన తర్వాత ఆధార్ లో బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని, ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయలేదని యూఐడీఏఐ సీఈవో భువ్‌నేష్ కుమార్ తెలిపారు. 15 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడానికి కూడా స్కూళ్లు, కళాశాలల ద్వారా ఇదే ప్రక్రియను చేపట్టాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News