Bijapur Encounter: మరోసారి కాల్పుల మోత.. మావోయిస్టు మృతి
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:30 AM
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

ఛత్తీస్‌గఢ్, జులై 5: బీజాపూర్ జిల్లాలో (Bijapur Encounter) మరోసారి కాల్పుల మోత మోగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుకుమా నాలుగు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ బలగాలతో పాటు ఎస్‌టీఎఫ్ బలగాలు ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
కాగా.. ఈ వర్షా కాలంలో మావోయిస్టులను నిదురపోనీయమంటూ గత ఆదివారం నాడు (జూన్ 29) నాడు నిజామాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతోంది. గతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు వర్షా కాలంలో నిలిపివేసేవారు. పెద్ద ఎత్తున నదులు, వాగులు, వంకలు పొంగడంతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో వర్షాకాలం నక్సలైట్లకు అనుకూల వాతావరణంగా భావించవచ్చు. కానీ కేంద్రహోంమంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో మావోయిస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ వర్షాకాలంలో మావోయిస్టులను నిదరపోయినీయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హోంమంత్రి చెప్పిన విధంగా ఆపరేషన్ కగార్ వర్షాకాలంలో కూడా దూకుడుగా కొనసాగనుంది. ప్రస్తుతం ఇంద్రావతి నదికి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాలుగు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
పుట్టిన రోజు వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి.. ఎందుకంటే
రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఇన్‌స్టా రీల్
Read Latest National News And Telugu News