Fake Voter Removal Bihar: నకిలీ ఓటర్ల తొలగింపునకే బిహార్లో జాబితాల సవరణ
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:08 AM
అధికార పక్షానికి మేలు కలిగించే విధంగా బిహార్‌లోని ఓటర్ల జాబితాలో సవరణలు చేస్తున్నారంటూ..

సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ
న్యూఢిల్లీ, జూలై 21: అధికార పక్షానికి మేలు కలిగించే విధంగా బిహార్‌లోని ఓటర్ల జాబితాలో సవరణలు చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలను ఎన్నికల సంఘం మరోసారి తిరస్కరించింది. నకిలీ ఓటర్లను తొలగించాలన్న లక్ష్యమే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు ప్రతిపక్షాలు దాఖలు చేసిన వ్యాజ్యాలకు సమాధానంగా సోమవారం ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. ఓటరు జాబితా నుంచి నకిలీ ఓటర్లను తొలగించాలన్న రాజ్యాంగపర విధిని నిర్వర్తిస్తున్నట్టు తెలిపింది. దీనివల్ల అసలు ఓటర్లకు ఎలాంటి నష్టం ఉండబోదని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News