Bihar Govt Formation: 20న కొలువుదీరనున్న బిహార్ ప్రభుత్వం, హాజరుకానున్న మోదీ
ABN , Publish Date - Nov 16 , 2025 | 08:18 PM
బిహార్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొనున్నారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఘనవిజయం సాధించిన ఎన్డీయే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈనెల 20న ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్డీయే వర్గాల సమాచారం. ఇందుకోసం భారీ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొనున్నారు.
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా సహా పలువురు ఎన్డీయే సీనియర్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గం కూర్పు తదితర అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ కూర్పునకు సంబంధించి ఒక ఫార్మూలాపైనా చర్చించనట్టు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం ఎన్డీయేలోని పార్టీలకు ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయిస్తారని తెలుస్తోంది. ఆ ప్రకారం బీజేపీకి 15 నుంచి 16, జేడీయూకు 14, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ (ఆర్వీ)కి 3, జితిన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం(సెక్యులర్)కు ఒకటి, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్‌ఎంకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. నితీష్ కుమార్ పేరును సీఎంగా ఎన్డీయే అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఆయనకు పాశ్వాన్, మాంఝీ మద్దతు ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది.
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.