Nitish Kumar: నితీష్‌ను ఆ పదవిలో చూడాలనుంది.. బీజేపీ నేత బిగ్ స్టేట్‌మెంట్
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:58 PM
చౌబే తరహాలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నితీష్ కుమర్ ఉపరాష్ట్రపతి కావాలనేది తన కోరక అని సుశీల్ కుమార్ మోదీ వంటి పలువురు బీజేపీ నేతలు చెప్పారు. రాజ్యాంగ ఉన్నత పదవికి తన పేరు పరిశీలించ లేదని నితీష్ 2022లో ఎన్డీయేను విడిచిపెట్టారు.

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ (Nitish Kumar) కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా? కీలక పదవిని అందుకోనున్నారా? ఈ తరహా ఊహాగానాలు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే (Aswini Kumar Choubey) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేకు నితీష్ కుమార్ సేవలు వెలకట్టలేమని, ఆయనను ఉప ప్రధానిగా చూడాలని ఉందని అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు.
Tahawwur Rana Extradition: రాణా ఆట కట్టించిన ఐపీఎస్.. కసబ్‌తో తలపడింది కూడా ఈయనే
పాట్నాలో బుధవారంనాడు మీడియాతో అశ్వినీ కుమార్ మాట్లాడుతూ, ఎన్డీయేకు నితీష్ సేవలు మరిచిపోలేమని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చేతులు కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో పాలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఉపప్రధాని పదవిని ఆయనకు ఇవ్వాలనేది తన కోరిక అని చెప్పారు. ఆ పదవి ఆయనకు లభిస్తే బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత బీహార్ నుంచి ఉప ప్రధాని అయిన వ్యక్తి నితీషే అవుతారని అన్నారు.
కాగా, గతంలో కూడా చౌబే తరహాలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నితీష్ కుమర్ ఉపరాష్ట్రపతి కావాలనేది తన కోరక అని సుశీల్ కుమార్ మోదీ వంటి పలువురు బీజేపీ నేతలు చెప్పారు. రాజ్యాంగ ఉన్నత పదవికి తన పేరు పరిశీలించ లేదని నితీష్ 2022లో ఎన్డీయేను విడిచిపెట్టారు.
బీహార్ ఎన్నికలు 2025
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. బీజేపీ-జేడీయూ పొత్తు ఈ ఎన్నికల్లో కొనసాగనుంది. ప్రస్తుత అసెంబ్లీలో 36 క్యాబినెట్ పదవులకు గాను బీజేపీ నుంచి 21 మంది మంత్రులు ఉండగా, జేడీయూ నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా 13 మంది మంత్రులుగా ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు గత వారంలో నితీష్ కుమార్, అమిత్‌షా సమావేశమయ్యారు. రెండు పార్టీల సీనియర్ నేతలు, రాష్ట్ర విభాగాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..