Share News

Big Blow to AAP: 13 మంది కౌన్సిలర్లు రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

ABN , Publish Date - May 17 , 2025 | 07:12 PM

ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు.

Big Blow to AAP: 13 మంది కౌన్సిలర్లు రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. 13 మంది కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ''ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ'' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయెల్ ఈ పార్టీకి సారథ్యం వహించే అవకాశం ఉంది. తమకు 15 మంది కౌన్సిలర్ల మద్దతు ఉన్నట్టు కూడా తిరుగుబాటు వర్గం ప్రకటించుకుంది. 2022 ఎంసీడీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆప్ అధినాయకత్వం ఎంసీడీలో పలు అవకతలకు పాల్పడిందని, కౌన్సిలర్లకు, పార్టీ నాయకత్వానికి మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడిందని తిరుగుబాటు వర్గం ఆరోపించింది.

Pakistan: భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌ల మరమ్మతుకు పాక్ టెండర్లు..


ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లలో దినేష్ కుమార్ (వార్డ్ నెంబర్ 2), హిమానీ జైన్ (వార్డ్ 153), రునాక్షి శర్మ (వార్డ్ 88), ఉషా శర్మ (వార్డ్ 72), అశోక్ పన్వార్ (వార్డ్ 109), సాహిబ్ కుమార్ (వార్డ్ 107), రాజేష్ కుమార్ లడి (వార్డ్ 99), మనీషా కల్రా (వార్డ్ 33), సుమాని అనిల్ (వార్డ్ 22), అశోక్ కుమార్ పాండే (వార్డ్ 109), ముఖేష్ గోయెల్ (వార్డ్ 15), దేవేంద్ర కుమార్ (వార్డ్ 196), హేమ్‌చంద్ గోయెల్ (వార్డ్ 181), రాణి ఖేడా (వార్డ్ 33) ఉన్నారు.


కాగా, ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఇంతవరకూ 15 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారని, రాబోయే రోజుల్లో మరికొందరు కూడా తమతో కలిసే అవకాశం ఉందని తెలిపారు.


ఇవీ చదవండి:

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 07:14 PM