Bengaluru News: తమలపాకు సాగే.. వారికి జీవనాధారం
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:59 PM
తమలపాకు అనేది ఆధ్యాత్మికంగా, వైద్యపరంగా, వస్తుపరంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదిగా పరిగణిస్తారు. శాస్ర్తీయ తీగజాతికి చెందిన ఈ ఆకు తేమ, వేడిప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. గుండె ఆకారంలో నిగనిగలాడుతూ ఉండే తమలపాకుకు దక్షిణాసియాలో బీటల్, బెరుయి తదితర పేర్లతో పిలుస్తారు.
- మూడు దశాబ్దాలుగా సాగు
బళ్లారి(బెంగళూరు): తమలపాకు అనేది ఆధ్యాత్మికంగా, వైద్యపరంగా, వస్తుపరంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదిగా పరిగణిస్తారు. శాస్ర్తీయ తీగజాతికి చెందిన ఈ ఆకు తేమ, వేడిప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. గుండె ఆకారంలో నిగనిగలాడుతూ ఉండే తమలపాకుకు దక్షిణాసియాలో బీటల్, బెరుయి తదితర పేర్లతో పిలుస్తారు. తమలపాకులు లేకుండా పూజలు, ప్రతాలు పూర్తికావు. ఇది దేవతలకు తాంబూలం రూపంలో హిందువులు అర్పిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో తమలపాకు మొక్కను పెంచితే ధనలాభం, ఆర్థిక కష్టాలు దూరమవుతాయని పూర్వికులు చెబుతుంటారు.
అలాంటి హిందూ సంప్రదాయల్లో అత్యంత ప్రముఖ స్థానం సంపాదించుకున్న తమలపాకు ఎంతోమంది రైతుల జీవితాల్లో వెలుగులు నిలుపుతోంది. ఎన్నో కుటుంబాలు ఈ పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉద్యాన పంట కాకపోయినా అధికవర్షపాతం, వేడి ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని సీజన్‌లలో ఆర్థికంగా ఆదుకుంటుందని రైతులు చెబుతున్నారు. కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా హిరేమన్నపుర గ్రామానికి చెందిన ఓ కుటుంబం మూడు తరాలుగా తమలపాకును పండిస్తూ జీవనోపాధి పొందుతుండడం విశేషం.

ఇతర పంటలతో రైతులు నష్టపోయినా, తాము నమ్ముకున్న తీగను తాము వదలుకోలేదని అంటున్నారు. మూడు దశాబ్దాల క్రితం తమలపాకు సాగును కుటుంబంలో పెద్దవాడైన దొడ్డప్ప విజయగాథ డాక్టర్ రాజ్‌కుమార్ నటించిన బంగారు మునుష్య సినిమాలోని సన్నివేశం గుర్తు చేస్తుంది. పెద్ద పెద్ద రాళ్లు, ముళ్లకంపలతో నిండిన భూమిలో యంత్రాలు లేనిరోజుల్లో కష్టపడి పనిచేసిన దొడ్డప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి దానిని చదును చేసి పంటసాగుకు అనుకూలంగా మలిచారు.

తమలపాకు సాగు అంత సులభం కాదు
దొడ్డప్ప, రైతు
తమలపాకు సాగు అంత సులభం కాదు. ఆకుచేతికొచ్చే వరకు తీగను జాగ్రత్తగా చూసుకోవాలి. శీతాకాలం, అధిక వర్షం, మంచు ఎక్కువగా కురుస్తున్న సమయంలో తమలపాకుకు కూడా వ్యాధులు సోకుతాయి. ప్రస్తుతం ధర తక్కువగా ఉంది. దీపావళి తరువాత ఆకు దిగుబడి తగ్గుతుంది. వారానికి నాలుగు సార్లు కోతలు కోస్తాం. ఈ పంట సాగుపై ప్రస్తుతం ఖర్చు పెరిగింది. బ్రోకర్ల వద్దకు వెళితే నష్టాలు వస్తాయని నేరుగా కస్టమర్లను వెతుక్కుని వారికి విక్రయిస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News