Share News

Bengaluru Metro: నమ్మ మెట్రోలో స్మార్ట్‌ సేవలు.. 70 శాతం విభాగాల్లో ఆధునికీకరణ

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:39 PM

మెట్రో ప్రయాణీకులకోసం ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించడంలో బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) రోజురోజుకూ కొత్త మైలురాళ్లు సాధిస్తోంది. అందులో భాగంగా 9కిపైగా యాప్‌లలో టిక్కెట్‌ లభించే సౌలభ్యం కల్పిస్తోంది.

Bengaluru Metro: నమ్మ మెట్రోలో స్మార్ట్‌ సేవలు.. 70 శాతం విభాగాల్లో ఆధునికీకరణ

- ఆన్‌లైన్‌ టిక్కెట్లతో ప్రయాణికులకు తగ్గిన కష్టాలు

బెంగళూరు: మెట్రో ప్రయాణీకులకోసం ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించడంలో బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Bangalore Metro Rail Corporation Limited) (బీఎంఆర్‌సీఎల్‌) రోజురోజుకూ కొత్త మైలురాళ్లు సాధిస్తోంది. అందులో భాగంగా 9కిపైగా యాప్‌లలో టిక్కెట్‌ లభించే సౌలభ్యం కల్పిస్తోంది. ఇలా ఆన్‌లైన్‌ టిక్కెట్‌, స్మార్ట్‌కార్డ్‌ల ద్వారా ప్రయాణించే వారి సంఖ్య 70శాతానికి పైగా ఉందని బీఎంఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం మహేశ్వర్‌రావు తెలిపారు.


2023 నుంచి ఓపెన్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) నెట్‌వర్క్‌లో ఆటో, ట్యాక్సీ సేవలు ఉండేవి. వీటికి మెట్రో టిక్కెట్‌లను కూడా చేర్చడం ద్వారా ప్రయాణీకులకు మరింత వెసలుబాటు కల్పించినట్టయ్యింది. ఆన్‌లైన్‌ టికెట్‌ ఉపయోగించేవారు ఒకే యాప్‌ ద్వారా తమ ఇంటినుంచి గమ్యస్థానం చేరేందుకు వీలుకానుంది. తద్వారా సమయం, శ్రమ పొదుపు కానుంది. నమ్మ మెట్రో మొబైల్‌ యాప్‌, థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా మెట్రో టిక్కెట్‌లు కొనుగోలు కల్పించారు. నమ్మయాత్రి, పేటీఎం, టమ్మాక్‌, ర్యాపిడో, రెడ్‌బస్‌, వాట్సప్‌ చాట్‌బోట్‌, ఈజ్‌ మై ట్రప్‌, హైవే డిలైట్‌, మైల్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌ (వయా టెలిగ్రామ్‌) వంటి యాప్‌ల ద్వారా మెట్రో టిక్కెట్‌ పొందవచ్చు.


pandu1.2.jpg

ఎన్‌రూట్‌ చాలెంజ్‌

రానున్న రోజుల్లో ప్రజలకు రవాణా వ్యవస్థ డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మరింత చేరువ కానుంది. ఇప్పటికే మెర్సిడెస్‌ బేస్డ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలె్‌పమెంట్‌ ఇండియా (బీఎంఆర్‌డీఐ), డబ్ల్యు ఆర్‌ఐ ఇండియా అండ్‌ విల్‌గ్రో సహకారంతో ‘ఎన్‌రూట్‌ ఛాలెంజ్‌’ విధానం అమలు చేశారు. తద్వారా మెట్రో, బస్‌, చివరి స్టేజ్‌ చేరుకునేలా వీలు కల్పించారు. బీఎంటీసీ, బీఎంఆర్‌సీఎల్‌ ఇందుకు సహకారం అందించడంతో కొండంత బలం చేరింది.


డిజిటల్‌ ఆవిష్కరణల ప్రారంభపు రోజుల్లో కొన్ని సవాళ్లు ఉండేవి. వాటికి శాశ్వత పరిష్కారానికి ఎన్నో చర్యలు చేపట్టారు. ఓలా, ఉబెర్‌ ప్రారంభంపు రోజుల్లో ట్యాక్సీ సంఘాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇవన్నీ ట్యాక్సీ డ్రైవర్లకు అదనపు ఆదాయం తెచ్చే వనరుల్లా మారాయి. అదే రీతిన వాట్సప్‌ చాట్‌ ద్వారా టికెట్‌ పొందే వ్యవస్థను బీఎంఆర్‌సీఎల్‌ తొలుత జారీ చేసింది. కొన్ని నెలలక్రితం ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్‌ పొందే ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యలపై ప్ర యాణికులనుంచి ఫిర్యాదులు రావడంతో వాటిని క్రమేపీ పరిష్కరించగలిగింది. ఇలా ప్రస్తుతం 9 రకాల యాప్‌ల ద్వారా టిక్కెట్‌లు పొందే వెసలుబాటు లభించినట్లయింది.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 18 , 2025 | 01:39 PM