Share News

Bengaluru: కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చాం

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:29 PM

అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్‌ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్‌ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

Bengaluru: కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చాం

- ఎస్కేయూ సభ్యుడు రాజశేఖర్‌

బళ్లారి(బెంగళూరు): కశ్మీర్‌ను చూడాలనే కోరిక, పిల్లలకు వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపాలని వెళ్లాము..కానీ ఇలా కాల్పులు జరిగి అమాయకులు బలి అవుతారని అనుకోలేదు. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బళ్లారి(Ballary) కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ కమిటీ సభ్యుడు టీఎం రాజశేఖర్‌. తన భార్య, ఇద్దరు పిల్లలు కలిసి ఆయన కశ్మీర్‌కు వెళ్లారు. ఆదివారం వీరు కుటుంబ సమేతంగా నగరానికి చేరకున్నారు. బుధవారం కాశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఈ వార్తను కూడా చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డమైందని..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌కు వెళ్లాలని గత సంవత్సరమే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుని కశ్మీర్‌కు చేరుకున్నాము. రెండు రోజులు సరదాగా గడిపాము, మూడోరోజు బుధవారం మాపాప, మా ఆవిడ షాపింగ్‌కు వెళ్లారు. నేను బయట నిల్చుని ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాను. తుఫాకీల శబ్దం. తూటాలు దూసుకుంటూ మాపక్కన నుండే వారికి తగిలాయి. నేను నేలపైన పడుకుండిపోయాను. ఇలా 20 నిమిషాల తరువాత కోలుకుని లేచాను అప్పటికే అంతా అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.


pandu1,2.jpg

అప్పుడు తెలిసింది ఉగ్రవాదులు కాల్పులు జరిపారని. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. 26 మంది మృత్యువాత పడడం బాధాకరం. అదృష్టవశాత్తు బయట పడ్డాం. మరో నాలుగు రోజులు ఉండి తిరిగి ప్రయాణానికి ఫ్లెట్‌ టికెట్‌ బుక్‌ చేశాము. ఫ్లైట్‌ టికెట్‌ ఏకంగా 5 రెట్లు పెంచేశారు, అయినా తప్పక ఫ్లెయిట్‌కు వచ్చేశాము. ఉగ్రవాదుల చర్య క్షమిచరాని నేరం. అమాయక టూరిస్టులను బలికొడనం వారి పిరికి తనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది కన్నడిగులు కాశ్మీర్‌ టూరుకు వచ్చారు. వారు క్షేమంగా చేరుకున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 01:29 PM