Share News

Plastic Ban: ఈ ప్రాంతాల్లో బాటిల్ సహా 28 ప్లాస్టిక్ వస్తువులు వాడటం నిషేధం.. కోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Apr 17 , 2025 | 08:20 PM

Ooty, Kodaikanal, Western Ghats, plastic ban, 28 plastic items, Tamil Nadu environment, eco-tourism, pollution control, sustainable travel, single-use plastic ban

Plastic Ban: ఈ ప్రాంతాల్లో బాటిల్ సహా 28 ప్లాస్టిక్ వస్తువులు వాడటం నిషేధం.. కోర్టు కీలక తీర్పు
Ban on 28 Plastic Items

దేశంలో పశ్చిమ కనుమలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మేఘాలను తాకినట్లుగా ఉండే హరిత పర్వతాలు, చల్లని గాలి, పచ్చని ప్రకృతి అందాల నడుమ ఊటీ, కొడైకెనాల్, నీలగిరి వంటి పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రాంతాలకు ప్రతి ఏటా కూడా నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే అనేక మంది వస్తున్న కారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా క్రమంగా పెరిగిపోతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ప్రకృతి ప్రేమికులకు ఊరట కల్పిస్తోంది.


నిషేధాన్ని ఉల్లంఘించి

ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ సహా 28 రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఉత్పత్తులలో ప్రధానంగా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వస్తువులు, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ కట్లరీ, ప్లాస్టిక్ బాటిళ్లు వంటివి ఉన్నాయి. నిషేధాన్ని ఉల్లంఘించి ప్లాస్టిక్ ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలను కూడా సీజ్ చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. వాటర్ బాటిళ్లు, బ్యాగులు వంటి వస్తువులు ఉన్న టూరిస్ట్ బ్యాగులను అద్దెకు ఇచ్చే పథకాన్ని అమలు చేయవచ్చని హైకోర్టు తెలిపింది.


పిటిషన్ విచారణ

దీంతో ఈ ప్రాంతాల్లో శుభ్రతను పరిరక్షించడంతో పాటు, స్థానిక జీవజాలం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదపడనుంది. ఈ నిషేధం వెనుక ఉన్న లక్ష్యం వాతావరణాన్ని కాపాడటం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం. నీలగిరిలోకి ప్లాస్టిక్ ఉత్పత్తుల ప్రవేశాన్ని నిషేధించాలని కోరుతూ సుబ్రమణ్య కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వు జారీ చేసింది.

ఈ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత, పర్యావరణానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గడం, జంతువులపై ప్లాస్టిక్ ముప్పు తగ్గిపోయి, మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పర్యాటక ప్రాంతాల శుభ్రతను పెంచడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం సహా అనేక ప్రయోజనాలు ఉంటాయి.


ఇవి కూడా చదవండి:


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..

Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 08:20 PM