Land For Job Scam Case: లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్, కుమార్తె హేమకు బెయిల్
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:50 PM
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమ యాదవ్, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ కావడంతో ఇరువురూ కోర్టుకు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: స్థలాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కుంభకోణం (Land for job Scam) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమ యాదవ్, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ కావడంతో తేజ్ ప్రతాప్, హేమ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వీరికి కోర్టు రూ.50,000 పూచీకత్తు, అంతే మొత్తానికి ష్యూరిటీతో కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, మిసాభారతి హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వీరు దరఖాస్తు చేసుకున్నారు.
Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు
ఈ కేసులో తుది ఛార్జిషీట్లుతో సహా మూడు చార్జిషీట్లను సీబీఐ దాఖలుచేసింది. ఇందులో లాలూ ప్రసాద్, మరో 77 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నో.. తేజ్ ప్రతాప్, హేమయాదవ్ తదితరులకు బెయిలు మంజూరు చేస్తూ, తదుపరి విచారణను మార్చ 20వ తేదీకి వాయిదా వేశారు.
ఈ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 మధ్య కాలానికి సంబంధించినది. ఆయన హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే గ్రూప్ డీ పోస్టుల్లో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిగా లాలూ కుటుంబ సభ్యులు, ఇతర అనుచరుల పేరిట భూములను రిజిస్టర్ చేయించున్నారని సమాచారం. ఈ కేసులో క్రిమినల్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు లాలూ కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించాయి.
ఇవి కూడా చదవండి
Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.