Share News

Supreme Court Rules: నగదు డిపాజిట్‌ చేయించి బెయిల్‌ ఇవ్వకూడదు

ABN , Publish Date - Aug 01 , 2025 | 03:00 AM

నిందితుడు ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

Supreme Court Rules: నగదు డిపాజిట్‌ చేయించి బెయిల్‌ ఇవ్వకూడదు

  • నిందితుడి హామీని నమ్మకూడదు

  • న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 31: నిందితుడు ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నగదు డిపాజిట్‌గా తీసుకొని బెయిల్‌ ఇవ్వకూడదని పేర్కొంది. కేవలం కేసులోని విషయం ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ తీర్పును అన్ని హైకోర్టులు, ట్రయల్‌ కోర్టులకు పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రూ.1.6 కోట్లను దుర్వినియోగం చేశారన్న కేసులో గజానన్‌ దత్తాత్రేయ గోరే అనే వ్యక్తి బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. రూ.25 లక్షలను డిపాజిట్‌ చేస్తానని అతడు హామీ ఇవ్వడంతో బెయి ల్‌ మంజూరు చేసింది. విడుదలయిన తరువాత అత డు ఆ సొమ్మును డిపాజిట్‌ చేయకపోవడంతో హైకో ర్టు బెయిల్‌ను రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 03:00 AM