Share News

Parliament Session: 22 నిమిషాల్లో ప్రతికారం తీర్చుకున్నాం.. జేపీ నడ్డా

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:17 PM

సాయుధ బలగాలకు రాజకీయ నాయకత్వం దిశానిర్దేశం చేయడం ఎంతో ముఖ్యమని జేేపీ నడ్డా పేర్కొన్నారు. 2005 ఢిల్లీ వరుస బాంబు పేలుళ్లు, 2006 వారణాసి ఉగ్రదాడి, 2006 ముంబై లోకల్ రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Parliament Session: 22 నిమిషాల్లో ప్రతికారం తీర్చుకున్నాం.. జేపీ నడ్డా
JP Nadda

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ 'అపరేషన్ సింధూర్' (Operation Sindoor)తో కేవలం 22 నిమిషాల్లో ప్రతీకారం తీర్చుకుందని, ఇది ఆన్ రికార్డ్‌ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. పాకిస్థాన్‌కు ఆపరేషన్ సింధూర్‌ ద్వారా పీఎం మోదీ ఇచ్చిన గట్టి స్పందన ఇంతవరకూ చరిత్రలోనే లేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజైన బుధవారంనాడు రాజ్యసభలో కొనసాగిన చర్చలో నడ్డా మాట్లాడారు.


26/11 ముంబై పేలుళ్ల ఘటనను ఆర్ఎస్ఎస్‌తో కాంగ్రెస్ ముడిపెట్టడంపై నడ్డా మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ, వారణాసి, ముంబై ఉగ్రదాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది అప్పటి ప్రభుత్వ అచేనత్వాన్ని చాటుతుందని అన్నారు. ఆక్సాయ్ చిన్‌పై పార్లమెంటులో అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన వ్యాఖ్యలను కూడా నడ్డా తప్పుపట్టారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను విడగొట్టిన ఇందిరాగాంధీకి మనం కృతజ్ఞతలు చెబుతున్నామని, కానీ సిమ్లా ఎగ్రిమెంట్‌తో 15,000 చదరపు కిలోమీటర్ల భూమిని పాక్‌కు కట్టబెట్టారని విమర్శించారు. అసలు విషయం ఇలా ఉంటే పాకిస్థాన్‌కు కేంద్రం లొంగిపోయిందంటూ తమను విమర్శించడం విడ్డూరమన్నారు.


సాయుధ బలగాలకు రాజకీయ నాయకత్వం దిశానిర్దేశం చేయడం ఎంతో ముఖ్యమని నడ్డా పేర్కొన్నారు. 2005 ఢిల్లీ వరుస బాంబు పేలుళ్లు, 2006 వారణాసి ఉగ్రదాడి, 2006 ముంబై లోకల్ రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య టెర్రర్-ట్రేడ్-టూరిజం కొనసాగాయని తప్పుపట్టారు. 2008లో అంత పెద్ద దాడి జరిగేతే ఆవిషయాన్ని కనీసం 2009 ఎస్‌సీఓ సదస్సులో ప్రస్తావించ లేకపోయారని అన్నారు. రక్తం-నీరు కలిసి ప్రవహించవని జైశంకర్, అణ్వస్త్రాల పేరుతో భారత్‌ను బెదిరించలేరని, ఉగ్రవాదానికి పాల్పడేవారికి- దానికి మద్దతిచ్చేవారికి తేడా ఏమీ లేదని ప్రధానమంత్రి మోదీ చాలా స్పష్టంగా పాక్‌కు వార్నింగ్ ఇచ్చారని నడ్డా తెలిపారు.


జమ్మూకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదానికి తెర

జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ తర్వాత స్థానిక ఉగ్రవాదానికి తెరపడిందని నడ్డా తెలిపారు. 2010-14 మధ్య రాళ్లు రువ్వుడు ఘటనలు 2,654 చోటుటేసుకున్నాయని చెప్పారు. అయితే గత మూడేళ్లుగా అలాంటి ఘటనలేవీ చోటుచేసుకోలోదని అన్నారు. గత మూడేళ్లలో కశ్మీర్ లోయ మూతపడిన దాఖలాలు లేవని, ఇదంతా 370వ అధికరణ రద్దు ఫలితమేనని వివరించారు. ఉరీ సర్జికల్ దాడులపై మాట్లాడుతూ, ఉరీ దాడులకు పాల్పడ్డ వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని ప్రకటించడం, కేవలం మూడు రోజుల్లో సర్జికల్ దాడులు విజయవంతంగా నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. 1947 తర్వాత పాక్‌కు ఇంత గట్టి సమాధానం ఇవ్వడం ఇదే ప్రథమమని చెప్పారు. ఇది మారుతున్న ఇండియా అని, రాజకీయ దృఢ సంకల్పం ఎవరికి ఉందో, ఏమి జరిగింతోందో అంతా చూస్తూనే ఉన్నారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ వైఖరిని ఎండగడుతూ ప్రపంచ దేశాల్లో పర్యటించిన అఖిల పక్ష పార్టీలను ఆయన అభినందించారు.


ఇవి కూడా చదవండి..

అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్

మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు.. జస్టిస్ యశ్వంత్‌వర్మపై సుప్రీం వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 05:22 PM