Chhatrapati Shambhajinagar:ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:52 AM
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్(Chhatrapati Shambhajinagar) స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరు మార్చబడిన మూడు ఏళ్ల తరువాత శనివారం సెంట్రల్ రైల్వే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా "ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్" గా పేరు మార్చింది.
మహారాష్ట్ర, అక్టోబర్ 26: ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్(Chhatrapati Shambhajinagar) స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరు మార్చబడిన మూడు ఏళ్ల తరువాత శనివారం సెంట్రల్ రైల్వే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా "ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్" గా పేరు మార్చింది. కొత్త స్టేషన్ కోడ్ 'CPSN' అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్(Nanded division) పరిధిలోకి వస్తుంది. బిజెపి నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా ఔరంగాబాద్ నగరం మార్పు జరిగింది.
తాజాగా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్(Aurangabad city name change) పేరు కూడా శంభాజీ మహారాజ్ గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్టేషన్ పేరును మార్చడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియను పూర్తైంది. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నిర్మించారు. ఛత్రపతి శంభాజీనగర్ ఒక పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నగరం చుట్టూ అజంతా గుహలు, ఎల్లోరా గుహలు వంటి అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ రెండూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా(UNESCO heritage sites) గుర్తింపు పొందాయి.
ఇవి కూడా చదవండి:
Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా
Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్