Share News

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్

ABN , Publish Date - Jan 13 , 2025 | 08:45 PM

ఇండియాతో సహా పలు ప్రపంచదేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని, మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజల మూడోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని వైష్ణవ్ తెలిపారు.

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: భారతదేశంలోని అధికార పార్టీ అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ ఓడిపోయిందని మెటా (Meta) చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ (Zuckererg) ఇటీవల చేసిన వాదనను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) తోసిపుచ్చారు. ఇండియాతో సహా పలు ప్రపంచదేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని, మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజల మూడోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని వైష్ణవ్ తెలిపారు.

Mahakumbh 2025: తొలిరోజు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు


''ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా 2024లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించింది. 64 కోట్ల మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయేపై ప్రజలు విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. కోవిడ్ మహమ్మారి అనంతరం భారత్‌తో అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడియాయంటూ జుకర్‌బర్గ్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. కోవిడ్ సమయంలో మోదీ ప్రభుత్వం చేసిన కృషి అందరి ప్రసంశలు అదుకుంది. జుకర్‌బర్గ్ వాస్తవాలను తెలుసుకుని, విశ్వసనీయతను కాపాడుకోవాలి'' అని అశ్విని వైష్ణవ్ అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం కల్పించడంతో పాటు 220 కోట్ల ఉచిత వ్యాక్సిన్లు అందించడం, కోవిడ్ కాలంలో ప్రపంచ దేశాలను ఆదుకోవడం జరిగిందని, అతివేగంగా ఆర్థికావృద్ధికి చెందుతున్న దేశంగా భారత్ మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. సుపరిపాలన, ప్రజావిశ్వాసం చూరగొనడం వంటివి ప్రధానమంత్రి మోదీ మూడోసారి విజయానికి నిదర్శంగా నిలిచాయన్నారు.


జుకర్‌బర్గ్ ఏమన్నారు?

అమెరికన్ పోడ్‌కాస్టర్ జో రోగన్‌తో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 2024 అతిపెద్ద ఎన్నికల సంవత్సరం అని అన్నారు. ''ఇండియాతో సహా ఈ దేశాలన్నింటిలోనూ ఎన్నికలు జరిగాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఓటమి చవిచూశాయి. ఇందుకు ద్రవ్యోల్బణం, ఆర్థిక విధానాలు, కోవిడ్‌ వంటి అనేక కారణాలున్నాయి. అధికార ప్రభుత్వాలపై విశ్వసనీయ తగ్గింది'' అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 08:47 PM