Share News

Ajit Doval: భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:53 PM

చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.

Ajit Doval: భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్
Ajit Doval

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) విమర్శకులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మండిపడ్డారు. ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగించిందనే వాదనను కొట్టివేశారు. భారత్‌కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేసే ఒక్క ఫోటోనైనా చూపించండని సవాలు చేశారు.


చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నారనే కచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపామని చెప్పారు. భారతదేశ ఇంటెలిజెన్స్, కార్యాచరణ కచ్చితత్వాన్ని ఈ మిషన్ చాటిచెప్పిందని అన్నారు. కేవలం 32 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్టు చెప్పారు. భారతదేశ వ్యూహాత్మక ఆపరేషన్‌ విశ్వసనీయతను ప్రశ్నించే వారు భారత్ వైపు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఫోటోనైనా చూపించాలని సవాలు చేశారు.


అంతర్జాతీయ మీడియా నెగిటివ్ కవరేజ్‌ను ప్రస్తావిస్తూ, 'ది న్యూయార్క్ టైమ్' వంటి ప్రముఖ పబ్లికేషన్లు ఈ ఘటనపై విస్తృతమైన కథనాలు రాశాయని, అయితే శాటిలైట్ ఇమేజ్‌లు ఇందుకు భిన్నమైన వాస్తవాలను వెల్లడి చేశాయన్నారు. మే 10వ తేదీకి ముందు, ఆ తరువాత పాకిస్థాన్‌లోని 13 ఎయిర్ బేస్‌లకు ఒక్క గీత కూడా పడలేదని శాటిలైట్ ఇమేజ్‌లు చూపించాయని, అది నిజమని దోభాల్ స్పష్టం చేశారు.


ఈ ఆపరేషన్‌లో స్వదేశీ రక్షణ సాంకేతికతను ఉపయోగించించామని, డిఫెన్స్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తికి దేశం కట్టుబడి ఉండటాన్ని ఇది చాటిచెప్పిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధనాసంపత్తిని దేశీయంగానే భారత్ రూపొందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్ మన దేశ అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని, సర్జికల్ కచ్చితత్వాన్ని నిరూపించిందని తెలిపారు.


ఇందులో ఏం డౌట్ లేదు.. ఐదేళ్ళు నేనే సీఎం..

8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 04:42 PM