Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!
ABN , Publish Date - Mar 16 , 2025 | 08:18 AM
దేశ రాజధాని ఢిల్లీలో చాలా నెలల తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది. మూడేళ్ల తర్వాత నిన్న కాలుష్య స్థాయి తగ్గిపోయి, గాలి నాణ్యత పెరిగింది. అయితే ఏ మేరకు తగ్గిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత మూడేళ్లలో తొలిసారి ఢిల్లీలో గాలి నాణ్యత (Delhi Air Quality) గణనీయంగా మెరుగుపడింది. శనివారం (మార్చి 15న) నమోదైన గాలి నాణ్యత సూచీ (AQI) 85గా నమోదైంది. ఇది జనవరి 1 నుంచి మార్చి 15 మధ్య కాలంలో గత మూడేళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి కావడం విశేషం. దీంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) 2025లో తొలిసారిగా ఢిల్లీ గాలి నాణ్యత 'సంతృప్తికరమైన' (AQI 51-100) విభాగంలోకి చేరుకుందని ప్రకటించింది.
దీనికి ముందు
ఈ విషయాన్ని CAQM తమ అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో ఢిల్లీలో సగటు AQI 85గా ఉందని ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో ఇదే అత్యల్ప స్థాయి. ప్రస్తుత సంవత్సరంలో 'సంతృప్తికరమైన' గాలి నాణ్యత నమోదైన మొదటి రోజు ఇది" అని తెలిపింది. దీనికి ముందు 2020 తర్వాత మార్చి నెలలో తొలిసారిగా ఢిల్లీలో 'సంతృప్తికరమైన' గాలి నాణ్యత నమోదైంది. ఇప్పుడు మళ్లీ అదే మార్చిలో మెరుగైన గాలి నాణ్యత నమోదు కావడం విశేషం.
గాలి నాణ్యత మెరుగుపడటానికి కారణాలేంటి?
వాతావరణ మార్పులు: గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో వర్షపాతం, గాలుల వేగం పెరగడం వల్ల కాలుష్య స్థాయి తగ్గిపోయి, గాలి నాణ్యత మెరుగుపడింది
ప్రభుత్వ నియంత్రణలు: పారిశ్రామిక కాలుష్య నియంత్రణ, నిర్మాణ పనుల నియంత్రణ, పలు గ్రీన్ ప్రాజెక్టుల కారణంగా గాలి కాలుష్యం తగ్గింది
పర్యావరణ అనుకూల విధానాలు: పెరిగిన ఎలక్ట్రిక్ వాహన వినియోగం, పర్యావరణ విధానాలు అమలు చేయడం వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగింది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
శీతాకాలం ముగియడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని ఐనాపూర్ హోబ్లి గ్రామంలో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 42.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
సెల్సియస్ వరకు పెరిగే అవకాశం
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, మార్చి 15 నుంచి 17 మధ్య ఉత్తర కర్ణాటకలో ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. మరింతగా, మార్చి 18-19 తేదీలలో తీవ్ర వేడిగాలులు ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) ప్రకారం కలబురగి, బీదర్, బాగల్‌కోట్, రాయచూర్, యాద్గిర్, విజయపుర జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News