Air India Problems: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:24 AM
ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది.

జైపూర్, జూలై 25: ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 1.35 గంటలకు జైపూర్ నుంచి ముంబై బయల్దేరిన విమానం నిమిషాల వ్యవధిలోనే వెనక్కొచ్చింది. టేకాఫ్ అయిన 18 నిమిషాల్లోపే అందులో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించడంతో తిరిగి జైపూర్‌కు మళ్లించారని ఎయిర్‌లైన్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ పేర్కొంది. ఇటీవల కాలంలో ఎయిరిండియా విమానాల్లో తరచూ సమస్యలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఏడాది జూలై 21 నాటికి ఐదు విమానయాన సంస్థలు మొత్తం 183 సాంకేతిక సమస్యలను నమోదు చేశాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో అత్యధికంగా ఎయిరిండియా గ్రూప్‌నకు చెందినవే 85 వరకూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News