Women Safety Posters: మహిళలు సేఫ్టీ కోసం ఇళ్లల్లోనే ఉండండి.. వివాదాస్పద పోస్టర్ల
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:41 PM
వివాదాస్పద పోస్టర్లపై డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) నీతా దేశాయ్ వివరణ ఇస్తూ, ఇది రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రచారం అని, మహిళల భద్రతకు సంబంధించినది కాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సత్‌కృతా గ్రూప్ ఈ పోస్టర్లు వేసిందని చెప్పారు.

అహ్మదాబాద్: అత్యాచారాలు జరక్కుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలోనే ఉండాలంటూ అహ్మదాబాద్‌లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించడంపై పోలీసు శాఖ నిర్వాకంపై వివిధ వర్గాలు నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
'లేట్ నైట్ పార్టీలకు హాజరు కావద్దు, మీరు రేప్ కావచ్చు, సామూజిక అత్యాచారానికి గురి కావచ్చు', 'మీ ఫ్రెండ్‌ను తీసుకుని చీకట్లోకి, ఒంటరి ప్రాంతాలకు వెళ్లకండి. ఆమె అత్యాచారానికో, సామూహిక హత్యాచారారానికో గురైతే పరిస్థితి ఏమిటి?' అంటూ రాసున్న ఈ పోస్టర్లు సోలా, చాంద్లోడియా ఏరియాలోని రోడ్ డివైడర్ల వద్ద కనిపించడంతో పోలీసులు వెంటనే వాటిని తొలగించారు.
పోలీసుల వివరణ
కాగా, వివాదాస్పద పోస్టర్లపై డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) నీతా దేశాయ్ వివరణ ఇస్తూ, ఇది రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రచారం అని, మహిళల భద్రతకు సంబంధించినది కాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సత్‌కృతా గ్రూప్ ఈ పోస్టర్లు వేసిందని చెప్పారు. స్కూలు, కాలేజీలో ట్రాఫిక్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించామని సందరు సంస్థ తమను కోరిందని, తమకు ట్రాఫిక్ అవేర్‌నెస్‌కు సంబంధించిన పోస్టర్లు చూపించారని, వివాదాస్పద పోస్టర్లు తమకు చూపించలేదని, వాటికి తన అనుమతి కూడా లేదని తెలిపారు. అయితే వివాదాస్పద పోస్టర్ల సమాచారం తమ దృష్టికి రావడంతో వాటిని తొలగించామని వివరించారు.
కాగా, వైరల్ పోస్టర్లపై బీజేపీ ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తప్పుపట్టింది. గుజరాత్ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి మాట్లాడుతుందని, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్‌తో గత ఏడాదిలో 6,500 అత్యాచారం ఘటనలు, 36 సామూహిక అత్యాచారం ఘటనలు జరిగాయని, రోజుకు ఐదుకు పైగా అత్యాచారాల రికార్డు ఉందని ఆరోపించారు. గుజారాద్ ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలా? వద్దా? అనేది ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్
పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి