Share News

Meena: బీజేపీలోకి నటి మీనా?

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:08 AM

ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ..

Meena: బీజేపీలోకి నటి మీనా?

  • పార్టీలో చేరగానే కీలక పదవి ఇచ్చే యోచన!

చెన్నై, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ స్థానాలు సాధించాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చిన్నా చితకా పార్టీలను ఎన్‌డీఏ కూటమిలోకి రప్పించడంతో పాటు ప్రజాదరణ వున్న వివిధ రంగాల ప్రముఖులను కూడా దరి చేర్చుకుంటోంది.


మరీ ముఖ్యంగా తమిళనాట చరిష్మా వున్న సినీ ప్రముఖులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఖుష్బూ, నమిత, శరత్‌కుమార్‌ వంటి సినీ ప్రముఖులను చేర్చుకున్న బీజేపీ.. తాజాగా మీనాపై దృష్టి పెట్టింది. ఆ మేరకు ఆమె త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఆమె పార్టీలో చేరగానే రాష్ట్ర స్థాయిలో క్రియాశీలక పదవి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ యోచిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రస్థాయి కీలక పదవుల్లో ఖుష్బూ, మీనాలను నియమించాలని పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 26 , 2025 | 06:08 AM