Share News

Hero Vijay: యువ కామరాజర్‌ అంటూ.. పొగడ్తలు వద్దు

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:44 AM

వచ్చే యేడాది జరుగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించవద్దని, తనను ‘యువనేత కామరాజర్‌’ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపించకూడదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత, సినీ నటుడు విజయ్‌ విద్యార్థులకు హితవు పలికారు.

Hero Vijay: యువ కామరాజర్‌ అంటూ.. పొగడ్తలు వద్దు

- టీవీకే అధినేత విజయ్‌ హితవు

- టెన్త్‌, ప్లస్‌-2 విద్యార్థులకు నగదు కానుకలు

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించవద్దని, తనను ‘యువనేత కామరాజర్‌’ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపించకూడదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత, సినీ నటుడు విజయ్‌ విద్యార్థులకు హితవు పలికారు. శుక్రవారం ఉదయం మూడో విడతగా పదో తరగతి, ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు విద్యా అవార్డులు, నగదు కానుకలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 240 మంది మృతిచెందిన దుర్ఘటన దేశ ప్రజలందరినీ శోకసముద్రంలో పడేసిందన్నారు.


మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కాసేపు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత విజయ్‌ టెన్త్‌, ప్లస్‌-2 లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఆ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజయ్‌తో ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అనంతరం విజయ్‌ మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి, తమ పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని,


nani1.2.jpg

అదే విధంగా తనపై ఆదరాభిమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు తనను యువ కామరాజర్‌గా పిలువకూడదని హితవు పలికారు. విద్యార్థులు ఎల్లప్పుడూ విద్యపైనే దృష్టిసారించాలని, అప్పుడే వారంతా ఉన్నతస్థితికి చేరుకుంటారని అన్నారు. అహ్మదాబాద్‌ దుర్ఘటన కారణంగా తాను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, త్వరలో అందరినీ నేరుగా కలుసుకుంటానని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం మళ్లీ లక్ష

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 14 , 2025 | 12:04 PM