Share News

Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:40 PM

విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్‌ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.

Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
Air India Aircraft Accident

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా 171 విమానం కుప్పకూలిన దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్టిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతవరకూ జరిపిన దర్యాప్తు ఆధారంగా రూపొందించిన ప్రాథమిక నివేదికను ఏఏఐబీ మంగళవారంనాడు కేంద్ర పౌరవిమాన మంత్రిత్వ శాఖకు అందజేసింది. అయితే నివేదికలోని సమాచారానికి బయటపెట్టలేదు. దీనిని ఈ వారాంతంలో విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్‌ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధారంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.


అహ్మదాబాద్ నుంచి లండన్‌కు జూన్ 12న బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. విమానం మంటల్లో చిక్కుకోవడంతో అందులోని 242 మందిలో 241 మంది అక్కడికక్కడే మరణించారు. మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో మరో 29 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 270కి చేరింది. విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


ఇవి కూడా చదవండి..

రాముడు మావాడే.. శివుడూ మావాడే

పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 06:55 PM