Incredible India: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మైమరపించిన చిన్నారి
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:28 PM
ఆ చిట్టి చేతుల్లో ఎంత గొప్ప గౌరవం ఉంది. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మైమరపించిన ఆ చిన్నారి.. అడుగులు, ఆమె చేష్టలు చూస్తే ఎవ్వరైనా ఆశీర్వదించాల్సిందే. అంతేకాదు, దేశంలో రక్షణ సిబ్బందికి, వాళ్లు ధరించే యూనిఫాం పట్ల ఉన్న గొప్ప గౌరవానికి ఇదొక మచ్చుతునక.

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఒక అపురూపమైన సంఘటన చోటుచేసుకుంది. మన సమాజంలో దేశ రక్షణ సిబ్బంది యూనిఫాం పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రతిబింబించింది. మెట్రో స్టేషన్లో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందితో ఒక చిన్నారి చేసిన చిన్న పని.. దేశ సేవకుల పట్ల మన సమాజంలో ఉన్న ప్రేమ, గౌరవాన్ని మరోసారి నిరూపించింది.
ఇక, విషయంలోకి వెళ్తే, బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఒక చిన్నారి.. కొంచెం దూరంలో ఉన్న సీఐఎస్‌ఎఫ్(CISF) సిబ్బంది దగ్గరకు వెళ్తుంది. వెళ్లి ఒక జవాను పైకి తలెత్తి చూస్తుంది. ఆ యూనిఫాం పట్ల తనకున్న గొప్ప గౌరవాన్ని తన కళ్లలో చూపిస్తుంది. అంతేకాదు, కిందకు వంగి, సెక్కూరిటీ సిబ్బంది పాదాలను సగర్వంగా స్పురించి, మర్యాదపూర్వకంగా నమస్కరిస్తుంది.
ఈ వీడియోను సీఐఎస్‌ఎఫ్ తన అధికారిక 'ఎక్స్' అకౌంట్ లో పోస్ట్ చేసి, "టైనీ హ్యాండ్స్ - ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ యూనిఫాం" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ కి ఢిల్లీమెట్రో, నేషన్‌ఫస్ట్, హ్యూమానిటీఫస్ట్, ఇన్‌క్రెడిబుల్‌ఇండియా వంటి పదాలకు హ్యాష్‌ట్యాగ్ జోడించి పోస్ట్ చేశారు. సదరు వీడియోలో ఆ చిన్నారి చిట్టి చేష్టలు చూస్తే, ఎవరికైనా ఒళ్లు పులకించాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్..
ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?
Read latest Telangana News And Telugu News