Share News

ChatGPT Study Mode: చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్

ABN , Publish Date - Aug 03 , 2025 | 09:23 AM

భారతీయ విద్యార్థుల కోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 11 భాషల్లో అందుబాటులోకి వచ్చిన స్టడీ మోడ్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ChatGPT Study Mode: చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్
ChatGPT Study Mode

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల కోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చదువుల్లో విద్యార్థులకు సాయపడేందుకు ఉద్దేశించిన ఈ ఫీచర్‌లో బోలెడు విశేషాలు ఉన్నాయి. దీని సాయంతో స్టూడెంట్స్ పాఠ్యాంశాలను మరింత ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రివిజన్‌తో పాటు విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

మొత్తం 11 భారతీయ భాషల్లో దీన్ని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. దీంతో, దేశంలోని అన్ని ప్రాంతాల వారు స్టడీ మోడ్‌ను వాడుకునే అవకాశం లభించినట్టైంది. ఇందులో మల్టీ మోడల్ సామర్థ్యాలు ఉన్నాయి. అంటే.. స్టూడెంట్ కేవలం టెక్స్ట్‌తోనే కాకుండా వాయిస్, చిత్రాలను కూడా చాట్‌జీపీటీతో పంచుకుని తమ సందేహాలను తీర్చుకోవచ్చు.


విద్యార్థులు తమకు వచ్చిన అన్ని సందేహాలను స్టడీ మోడ్‌లో చాట్‌జీపీటీ ముందుంచి సులభమైన సమాధానాలను పొందొచ్చు. సైన్స్‌తో పాటు గణితంలో కూడా విద్యార్థుల సందేహాలు తీర్చేలా దీన్ని డిజైన్ చేశారు. భారీ పాఠ్యాంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి విద్యార్థులకు విడమర్చి చెప్పగలిగేలా స్టడీ మోడ్‌ను తీర్చి దిద్దారు. చదువులకు సంబంధించి రోజువారీ ప్రణాళికలను కూడా ఇది రూపొందించగలదు.

నగరాల్లోని విద్యార్థులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని వారికీ ఇది అందుబాటులో ఉండేలా మొబైల్ ఫ్రెండ్లీ ఫీచర్‌లతో దీన్ని డిజైన్ చేశారు. దీంతో, స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యార్థులు స్టడీ మోడ్‌ను సులువుగా వినియోగించవచ్చు. స్టూడెంట్స్ తమకు కావాల్సిన టాపిక్‌ను స్టడీ మోడ్ సాయంతో చదువుకోవచ్చు.


స్టడీ మోడ్ ఇలా..

  • ముందుగా యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా చాట్‌జీపీటీలోకి లాగిన్ కావాలి.

  • ఆ తరువాత హోమ్ స్క్రీన్‌లో కనిపించే స్టడీ మోడ్ ఫీచర్‌పై క్లిక్ చేయాలి.

  • అక్కడ మీకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకుని చదువు ప్రారంభించొచ్చు

క్విజ్‌లు, సంక్లిష్ట అంశాలపై సులభమైన వివరణలు, రివిజన్ కోసం సాధనాలు అనేకం స్టడీ మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ఫీచర్‌ను ఉపయోగించి చదువుల్లో దూసుకెళ్లిపోండి.

ఇవి కూడా చదవండి:

చార్జింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే..

చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ

Read Latest and Technology News

Updated Date - Aug 03 , 2025 | 11:57 AM