Girl Set On Fire Odisha: 15ఏళ్ల బాలికను కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:49 AM
ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులను భరించలేక ఓ విద్యార్థిని ఆత్మాహుతికి పాల్పడిన ఘటన మరువక ముందే ఒడిశాలో మరో

ఒడిశాలోని పూరీ జిల్లాలో ముగ్గురు దుండగుల చర్య
ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
పూరీ, జూలై 20: ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులను భరించలేక ఓ విద్యార్థిని ఆత్మాహుతికి పాల్పడిన ఘటన మరువక ముందే ఒడిశాలో మరో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు దుండుగులు పెట్రోల్ పోసి, నిప్పంటించారు. పూరీ జిల్లాలోని బయబర్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. 70ు కాలిన గాయాలతో సదరు బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాలికకు మెరుగైన వైద్యం కోసం ఆదివారం ఆమెను భువనేశ్వర్ ఎయిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు విమానంలో తరలించారు. శనివారం ఉదయం బాలిక తమ ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఆమెను అడ్డగించారు. కిడ్నాప్ చేసి భార్గవ నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను కట్టేసి, ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయపడి పారిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఒడిసాలో సంచలనం సృష్టించింది. ఘటనపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News