Crime News: చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క..
ABN , Publish Date - Jun 18 , 2025 | 07:40 AM
Crime News: అభం శుభం తెలియని 10 నెలల చిన్నారి బీడీ ముక్కకు బలయ్యాడు. తండ్రి కాల్చి పడేసిన చివరిముక్కను నోట్లో పెట్టుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

Mangalore: కర్ణాటక (Karnataka)లోని మంగళూరు (Mangalore)లోని దారుణం చోటుచేసుకుంది. తండ్రి కాల్చి పడేసిన బీడీ ముక్క (Beedi Stub) 10 నెలల చిన్నారి ప్రాణం తీసింది (10 Month Old Baby Dies). అభం శుభం తెలియని బాలుడు బీడీ ముక్కకు బలయ్యాడు. తండ్రి కాల్చి పడేసిన బీడీ చివరి ముక్కను అతని కుమారుడు నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
పూర్తి వివరాలు..
మంగళూరు నగర శివారు అడ్యార్‌లో బిహార్‌కు చెందిన లక్ష్మీదేవి కుటుంబం ఉంటోంది. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే మంగళవారం లక్ష్మీదేవి భర్త బీడీ కాల్చి చివరి ముక్కను కింద పడేశాడు. వారి 10 నెలల కుమారుడు అనీశ్‌కుమార్ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది గొంతులో ఇరుక్కొని ఇబ్బందిపడ్డాడు. బయటకు రాక.. లోపలకి వెళ్లకపోవడంతో ఆ బాలుడు చాలా ఇబ్బందిపడ్డాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఇరుక్కున్న బీడీ ముక్కను బయటకు తీసేందుకు సతవిధాలా ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ బీడీ ముక్క బయటకు తీసేలోగా బాలుడు మృతి చెందాడు. బిడ్డ ప్రాణాలు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
11 రోజుల్లో.. 6 దేశాలు తిరిగాం
For More AP News and Telugu News