-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Monday 30th June 2025 Top news and Major Events Across India Siva
-

Breaking News: కాళేశ్వరం ప్రాజెక్టు పలు డాక్యుమెంట్లు మాయం
ABN , First Publish Date - Jun 30 , 2025 | 11:24 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 30, 2025 20:46 IST
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు మొగ్గుచూపని కేంద్రం
బనకచర్ల ప్రాజెక్టు ఫైల్‌ను వెనక్కుపంపిన నిపుణుల కమిటీ
బనకచర్లపై పలు సందేహాలను లేవనెత్తిన EAC
బనకచర్లకు అనుమతులను ఇప్పుడే ఇవ్వలేమన్న EAC
బనకచర్ల ప్రాజెక్టుకు ప్రస్తుతం అనుమతి ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ
-
Jun 30, 2025 19:48 IST
పాశమైలారానికి సీఎం..
రేపు పాశమైలారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
పేలుడు ఘటనాస్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్
బాధిత కుటుంబాలతో మాట్లాడనున్న సీఎం రేవంత్
-
Jun 30, 2025 19:48 IST
కాళేశ్వరం ప్రాజెక్టు పలు డాక్యుమెంట్లు మాయం
ప్రాజెక్టు వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందన్న ఇరిగేషన్ అధికారులు
జలసౌధలో లేని కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు
ENCల నుంచి వివరాల సేకరణకు సమయం పడుతుందన్న అధికారులు
గత కేబినెట్‌లో జరిగిన రికార్డులను తీసిన ఫైనాన్స్, GAD అధికారులు
కమిషన్‌కు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వనున్న ప్రభుత్వం
నేటితో ముగియనున్న కాళేశ్వరం కమిషన్ గడువు
-
Jun 30, 2025 19:47 IST
పాశమైలారంలో కొనసాగుతోన్న సహాయ చర్యలు
భవన శిథిలాల కింద భారీ సంఖ్యలో కార్మికులు మృత్యువాత
శిథిలాలను తొలగించేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు
ప్రమాద స్థలంలో మరో రెండు మృతదేహాలు వెలికితీత
పేలుడు ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య
మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటన
భారీ వర్షంలోనూ కొనసాగుతోన్న సహాయక చర్యలు
-
Jun 30, 2025 17:58 IST
అది సాధ్యమేనా: ఏఐసీసీ సెక్రటరీ సంపత్
ABN, RKను భయపెట్టడం సాధ్యమా?: ఏఐసీసీ సెక్రటరీ సంపత్
కల్వకుంట్ల కుటుంబం పచ్చి అబద్ధాలు మాట్లాడినా.. ఆహా.. ఓహో అంటే తెలంగాణ ఛానెలా?: సంపత్
ఆపరేషన్ సిందూర్ కవరేజీలో ABN లోగో కనిపించింది..ABN కశ్మీర్ ఛానెలా?: సంపత్
BRS పని అయిపోయింది.. దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ వ్యాఖ్యలు: సంపత్
మీడియా సంస్థలను భయపెడతాం అంటే కుదరదు
BRSకి వ్యతిరేకంగా ఏ మీడియా రాయొద్దని భయపెడుతున్నారు
BRS మీడియా సంస్థ ఆ పార్టీ ఆఫీసులోనే ఉంది..అది అక్రమం: సంపత్
వార్తలపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయవచ్చు: సంపత్
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎలా?: సంపత్
-
Jun 30, 2025 17:58 IST
దారుణం..
మణిపూర్‌లో నలుగురిని కాల్చి చంపిన దుండగులు
మణిపూర్ రాష్ట్రం చురచందపూర్ జిల్లాలో ఘటన
-
Jun 30, 2025 17:56 IST
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన విచారణ
గ్రూప్-1 పిటిషన్లపై రేపు కూడా కొనసాగనున్న వాదనలు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై విచారణ
మెయిన్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషనర్లు
మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సరిగా జరగలేదన్న పిటిషనర్ల న్యాయవాదులు
మెయిన్స్ రాసిన వారి వివరాలు సరిగ్గా లేవన్న పిటిషనర్ల న్యాయవాదులు
పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ అవకతవకలు జరిగాయన్న న్యాయవాదులు
విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
గ్రూప్-1 నియామకాలపై గత విచారణపై స్టే విధించిన హైకోర్టు
ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టవచ్చన్న హైకోర్టు
నియామకాలపై ఉన్న స్టేను ఎత్తివేయాలని పిటిషన్లు దాఖలు
-
Jun 30, 2025 16:33 IST
కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపా: రాజాసింగ్
నేను బీజేపీ సభ్యుడిగా కాదని మీరు స్పీకర్‌కు చెప్పండి
నేను ఉగ్రవాదులకు టార్గెట్‌గా మారాను
మీకో దండం.. మీ పార్టీకో దండం: రాజాసింగ్
-
Jun 30, 2025 16:14 IST
రాజాసింగ్ సంచలన నిర్ణయం
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
రాజీనామా లేఖ కిషన్‌రెడ్డికి అందజేసిన రాజాసింగ్
అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చా: రాజాసింగ్
నా మద్దతుదారులను బెదిరించారు: రాజాసింగ్
బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారు: రాజాసింగ్
-
Jun 30, 2025 15:59 IST
లిక్కర్ కేసులో కీలక మలుపు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇద్దరు పీఏలను అదుపులోకి తీసుకున్న సిట్
ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ.8.20కోట్లు తీసుకువచ్చిన చెవిరెడ్డి పీఏ బాలాజీ
-
Jun 30, 2025 11:32 IST
సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
సీగాచి కెమికల్స్ పరిశ్రమలో పేలిన రియాక్టర్, భారీగా మంటలు.
మంటలార్పుతున్న నాలుగు ఫైరింజన్లు.
ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనం.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
20 మందికిపైగా కార్మికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ.
ఘాటైన వాసనతో ఇబ్బంది పడుతున్న స్థానికులు.
-
Jun 30, 2025 11:24 IST
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం?
మాజీ MLC రామ్‌చందర్ రావు పేరు దాదాపుగా ఖరారు.
కాసేపట్లో రామ్‌చందర్‌రావు నామినేషన్.
పార్టీ ముఖ్య నేతలకు నిన్న క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.
రేపు అధికారికంగా ప్రకటించనున్న పార్టీ ఎన్నికల కమిటీ.
మరో నామినేషన్ దాఖలైతే ఎన్నికలు అనివార్యం.