-
-
Home » Mukhyaamshalu » abn telugu brings you the latest breaking news in your hands of july 31vr
-

BREAKING: బెంగళూరు: ధర్మస్థల ఘటనపై కొనసాగుతున్న సిట్ విచారణ
ABN , First Publish Date - Jul 31 , 2025 | 06:08 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 31, 2025 20:11 IST
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు
పోలీసుల దర్యాప్తులో తప్పులు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత
సరోగసీ పేరుతో పలువురు దంపతులను మోసం చేసినట్లు అంగీకారం
రాజస్థాన్ దంపతులు DNA నివేదిక అడిగినట్లు తెలిపిన డాక్టర్ నమ్రత
DNA పరీక్షలు అడగటంతో రాజస్థాన్ దంపతుల నుంచి తప్పించుకున్నట్లు వెల్లడి
కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు ఒప్పుకున్న నమ్రత
-
Jul 31, 2025 20:11 IST
అమరావతి: కలెక్టర్లతో సీఎస్ కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్
అన్నదాత సుఖీభవ, P4, నీటి వనరులు తదితర అంశాలపై రివ్యూ
బంగారు కుటుంబాల దత్తత విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయొద్దు
స్వచ్ఛందంగా ముందుకొచ్చే మార్గదర్శుల ను గుర్తించాలి: సీఎస్
ఆగస్టు 15 నాటికి నిర్ణీత లక్ష్యాలు సాధించాలి: సీఎస్ విజయానంద్
-
Jul 31, 2025 20:11 IST
అమరావతి: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఎగువ నుంచి వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు రివ్యూ
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం
లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
-
Jul 31, 2025 20:11 IST
విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
10 రోజుల్లో అదనపు చార్జ్‌షీట్ దాఖలుకు సిద్ధమవుతున్న సిట్
లిక్కర్ కేసులో ఇప్పటికే 48 మంది నిందితులను చేర్చిన సిట్
లిక్కర్ కేసులో మరో నలుగురు నిందితులను చేర్చే అవకాశం
-
Jul 31, 2025 18:15 IST
ఒకే ప్రభుత్వం కొనసాగడం వల్ల అభివృద్ధి, పెట్టుబడులు సాధ్యం: లోకేష్
ఒకే ప్రభుత్వం కొనసాగింపుతో ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలి: లోకేష్
సింగపూర్ అభివృద్ధికి ఇదే కారణం: మంత్రి నారా లోకేష్
ఇతర రాష్ట్రాల్లో రాజకీయాన్ని ఆ రాష్ట్రం వరకే పరిమితం చేస్తారు: లోకేష్
ఇతర ప్రాంతాలకు వెళ్తే.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తారు: నారా లోకేష్
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలో మాత్రమే ఉంది
ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు జగన్ బయటకు రాగలరా?: లోకేష్
జగన్ హయాంలో చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లేసి కట్టలేదా?: లోకేష్
పోలీసులను భద్రత పెడితే పోలీసులను మోహరించాలని అంటారు..
పోలీసులను పెట్టకుంటే భద్రత ఇవ్వలేదని అంటారు: మంత్రి నారా లోకేష్
సొంత తల్లి, చెల్లి మీద ఎవ్వడైనా కేసులు పెడతారా?: మంత్రి నారా లోకేష్
ఆ కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా?: మంత్రి నారా లోకేష్
తల్లి మీద కేసు పెట్టి సంబరాలు చేసుకునే ఏకైక వ్యక్తి జగన్ రెడ్డే: లోకేష్
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి నాయకుడిగా పనికోస్తాడా?: లోకేష్
-
Jul 31, 2025 18:03 IST
కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ప్రారంభం
రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి జనహిత పాదయాత్ర ప్రారంభం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో పాదయాత్ర
పాదయాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న ఇన్‌ఛార్జి మీనాక్షి నాటరాజన్
నేటి నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు సాగనున్న తొలివిడత పాదయాత్ర
-
Jul 31, 2025 18:03 IST
హైదరాబాద్: నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
నీటిపారుదలశాఖకు చెందిన భూములు, ఆక్రమణలపై భేటీలో చర్చ
ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు
నీటిపారుదలశాఖ భూములు, భవనాలు, క్వార్టర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం
ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
నీరుపారుదుశాఖకు ప్రత్యేక జీపీని నియమించాలి: మంత్రి ఉత్తమ్
ఇరిగేషన్ భూములు, కాల్వల వెంట సోలార్ ప్లాంట్లు ఏర్పాటు పరిశీలించాలి: ఉత్తమ్
-
Jul 31, 2025 18:03 IST
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు కీలక సమావేశం
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
భేటీలో సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా
కాళేశ్వరం నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్న అధికారులు
వచ్చే కేబినెట్‌లో నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
-
Jul 31, 2025 18:03 IST
నంద్యాల: ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడిని ఖండించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కొలిమిగుండ్ల శ్రీలక్ష్మీనరసింహ ఆలయం దగ్గర విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి
దాడిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశాలు
అధికారులపై దాడులను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు: బీసీ జనార్దన్ రెడ్డి
-
Jul 31, 2025 16:14 IST
అన్నదాత సుఖీభవ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధం
అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేయనున్న కేంద్రం
కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.14 వేలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం
మూడు విడతలుగా అన్నదాత శుఖీభవన నిధులు జమచేయనున్న ప్రభుత్వం
తొలివిడతలో రాష్ట్రం వాచా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు జమ
ఏపీలో 46.85 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద లబ్ధి
అన్నదాత సుఖీభవ కోసం రూ.2,342.92 కోట్లు నిధులు కేటాయింపు
ఆగస్టు 2న దర్శిలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనున్న చంద్రబాబు
-
Jul 31, 2025 15:46 IST
బెంగళూరు: ధర్మస్థల ఘటనపై కొనసాగుతున్న సిట్ విచారణ
మృతదేహాలు పాతిపెట్టిన 15 ప్రాంతాల్లో మూడోరోజు తవ్వకాలు
భారీ భద్రత మధ్య మూడోరోజు కొనసాగుతున్న తవ్వకాలు
తొలిరోజు ఒకచోట, రెండోరోజు 4 ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు
నేడు మరో నాలుగు ప్రాంతాల్లో సిట్ అధికారుల తవ్వకాలు
తవ్వకాలు జరిపిన ఆరో పాయింట్ దగ్గర అస్థిపంజరం లభ్యం
మానవ అవశేషాలు లభ్యంకావడంతో మరింతలోతుగా తవ్వకాలు
-
Jul 31, 2025 13:07 IST
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయం
పార్టీ మారిన వెంటనే సభ్యత్వం రద్దు కావాలని రాహుల్ చెప్పారు
ఇప్పుడు తన మాటకు రాహుల్‌గాంధీ కట్టుబడి ఉన్నారా?: కేటీఆర్
-
Jul 31, 2025 12:54 IST
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
సంజయ్‌కి ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు
-
Jul 31, 2025 12:34 IST
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తా
గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం
-
Jul 31, 2025 12:17 IST
ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం రిపోర్ట్
నీటిపారుదల శాఖ కార్యదర్శి కి నివేదికను అందచేసిన పిసి గోష్
-
Jul 31, 2025 12:09 IST
మహారాష్ట్ర: 2008 మాలేగావ్ పేలుళ్లకేసులో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు
ఏడుగురు నిందితులు నిర్దోషులేనని ప్రకటించిన ఎన్‌ఐఏ కోర్టు
ఏడుగురికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవన్న ఎన్‌ఐఏ కోర్టు
-
Jul 31, 2025 11:38 IST
సిద్దిపేట: కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు భేటీ
సుప్రీంకోర్టు తీర్పు, ప్రస్తుత పరిణామాలపై చర్చ
-
Jul 31, 2025 11:19 IST
తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం
కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
జస్టిస్ ప్రవీణ్, రామకృష్ణారెడ్డి, చలపతిరావు, మీరా మొహియుద్దీన్ ప్రమాణస్వీకారం
-
Jul 31, 2025 10:55 IST
ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
BRS ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు
వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయాలని..
బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీజేఐ గవాయ్
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు
స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై..
పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలన్న సీజేఐ గవాయ్
-
Jul 31, 2025 10:44 IST
400 పేజీలతో తుది నివేదిక సిద్ధం చేసిన కమిషన్
నిబంధనలకు విరుద్ధంగా..
అధికారులు నిధులు విడుదలచేసినట్టు కమిషన్ గుర్తింపు
IASలు, ఇంజినీర్ల మధ్య సమన్వయలోపం ఉందన్న కమిషన్
రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రస్తావన
పూర్తిస్థాయి అనుమతులు లేకుండా..
డిజైన్లు మార్పు చేసినట్టు గుర్తించిన కమిషన్
-
Jul 31, 2025 10:28 IST
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు
స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో..
కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అనే దానిపై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు
ఈ ఏడాది ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ BR గవాయ్ ధర్మాసనం
కాసేపట్లో తీర్పు వెలువరించనున్న CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం
కేటీఆర్ రిట్, BRS ఎమ్మెల్యేల SLPలపై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
-
Jul 31, 2025 10:03 IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై APSRTC కసరత్తు
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి జీరో ఫేర్ టికెట్లు
మహిళలకు జారీ చేసే టికెట్లపై శ్రీశక్తి అని ముద్రణ
జీరో ఫేర్ టికెట్ల జారీపై ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ
ఏపీలో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు
-
Jul 31, 2025 10:00 IST
అమరావతి: ఉ.11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు
ఉ.11.45కి అమరావతి బ్యూటిఫికేషన్‌పై చంద్రబాబు సమీక్ష
మ.3 గంటలకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై..
వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
-
Jul 31, 2025 09:57 IST
హైదరాబాద్: గొర్రెల స్కామ్ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ
ఈడీ అదుపులోనే మాజీ మంత్రి తలసాని OSD కల్యాణ్
నిన్న కల్యాణ్ నివాసంలో కీలక డాక్యుమెంట్లు, డబ్బు స్వాధీనం
మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించిన అధికారులు
OSD కల్యాణ్‌ను ప్రశ్నిస్తోన్న ఈడీ అధికారులు
రూ.2.10కోట్లు అప్పటి CEO రాంచందర్‌తో పంచుకున్న కళ్యాణ్
-
Jul 31, 2025 09:55 IST
జగన్ పర్యటన పేరుతో శాంతిభద్రతలకు..
విఘాతం కలిగించేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు
జనసమీకరణ చేపట్టొద్దని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ హెచ్చరిక
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న వైసీపీ నేతలు
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో పాటు..
పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
-
Jul 31, 2025 09:37 IST
జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసుల ఆంక్షలు
పోలీసుల ఆంక్షలు పట్టించుకోని నెల్లూరు వైసీపీ శ్రేణులు
భారీ జన సమీకరణతో బల ప్రదర్శనకు వైసీపీ నేతల ఏర్పాట్లు
నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధం
-
Jul 31, 2025 08:41 IST
యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య
నిలిచిన వందలాది విమానాలు, ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో టేకాఫ్‌లు రద్దు
20 నిమిషాల తర్వాత సమస్యను సరిచేసిన అధికారులు
-
Jul 31, 2025 08:30 IST
ప్రత్యేక పాలస్తీనాకు మద్దతుగా మరో దేశం
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామన్న కెనడా ప్రధాని
ఇప్పటికే పాలస్తీనాకు మద్దతు తెలిపిన బ్రిటన్, ఫ్రాన్స్
పాలస్తీనా ప్రత్యేక దేశ ప్రతిపాదనను ఖండించిన ఇజ్రాయెల్ ప్రధాని
హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతిస్తున్నారు
పాలస్తీనాను దేశంగా గుర్తిస్తే భవిష్యత్‌లో ఇతర దేశాలకూ ముప్పే: నెతన్యాహు
-
Jul 31, 2025 08:28 IST
పల్నాడు: వైసీపీ నేత తురకా కిషోర్‌కు 14 రోజల రిమాండ్
సిద్దయ్యపై హత్యాయత్నం కేసులో తురకా కిషోర్ అరెస్ట్
కిషోర్‌కు రిమాండ్ విధించిన మాచర్ల సివిల్ న్యాయాధికారి
తురకా కిషోర్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
-
Jul 31, 2025 07:58 IST
సృష్టి నిందితుల కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
డాక్టర్ నమ్రత, కుమారుడు జయంత్‌ను కస్టడీ కోరిన పోలీసులు
నేడు తీర్పు ప్రకటించనున్న సికింద్రాబాద్ కోర్టు
-
Jul 31, 2025 07:52 IST
ట్రంప్ సుంకాలపై స్పందించిన భారత్, రైతులు, MSME వర్గాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం-కేంద్రం
-
Jul 31, 2025 07:48 IST
భారత్‌పై అమెరికా సుంకాల మోత
భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్
పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు
రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసింది
ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయి
భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయి
భారత్ మిత్రదేశమే కానీ అక్కడటారిఫ్‌లు ఎక్కువ-ట్రంప్
-
Jul 31, 2025 07:40 IST
ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు 6న ఏపీ సీఎస్ ప్రత్యేక సమావేశం
అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్న ఏపీ సీఎస్
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై సమీక్ష
-
Jul 31, 2025 07:10 IST
APPSC స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణలు
ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య..
200 రెట్లు మించితేనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణ
APPSC ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
మెజారిటీ ఉద్యోగ నియామకాల్లో అమల్లోకి ఏక పరీక్ష విధానం
-
Jul 31, 2025 06:50 IST
నేడు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన
సెంట్రల్ జైలులో ఉన్న కాకాణితో జగన్ ములాకత్
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నివాసానికి వెళ్లి పరామర్శించనున్న జగన్
-
Jul 31, 2025 06:45 IST
నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు
ఓవల్ టెస్టుకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
కుడి భుజానికి గాయంతో మ్యాచ్‌కు దూరమైన బెన్ స్టోక్స్
5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్
-
Jul 31, 2025 06:41 IST
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై ఉత్కంఠ
నేటితో ముగియనున్న జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు
ఇప్పటికే పూర్తయిన కాళేశ్వరం కమిషన్ విచారణ
రెండు రోజుల్లో ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్
కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం
కమిషన్ గడువును మరో 2, 3 రోజులు పెంచే అవకాశం
-
Jul 31, 2025 06:28 IST
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు
స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో..
కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అనే దానిపై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు
ఈ ఏడాది ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ BR గవాయ్ ధర్మాసనం
రేపు ఉదయం తీర్పు వెలువరించనున్న CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం
కేటీఆర్ రిట్ పిటిషన్, BRS ఎమ్మెల్యేల SLPలపై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
-
Jul 31, 2025 06:08 IST
నేటి నుంచి PCC చీఫ్ ఆధ్వర్యంలో మీనాక్షి పాదయాత్ర
పాదయాత్రకు జనహిత పాదయాత్రగా నామకరణం
నేటి నుంచి ఆగస్టు 4వరకు తొలి విడత పాదయాత్ర
రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో మొదలై..
ఆదిలాబాద్ ఖానాపూర్ వరకు కొనసాగనున్న యాత్ర